ENGLISH

పూరీ.. ఆ త‌ప్పు మ‌ళ్లీ చేయ‌కు

23 June 2022-10:01 AM

టాలీవుడ్‌లో అగ్ర ద‌ర్శ‌కుడిగా చ‌లామ‌ణీ అవుతున్నాడు పూరి జ‌గ‌న్నాథ్‌. తను ఎంతోమంది స్టార్ల‌ని త‌యారు చేశాడు. స్టార్ల‌ని సూప‌ర్ స్టార్లుగా చేశాడు. ఫ్లాపుల్లో ఉన్న‌వాళ్ల‌కు హిట్లు ఇచ్చాడు. సినిమా హిట్ట‌యినా, ఫ్లాప‌యినా ఒకేలా ఉండ‌డం, ఒకేలా ఆలోచించ‌డం పూరి స్టైల్‌. అయితే.. `మిగిలిన హీరోల గురించి త‌ర‌వాత ఆలోచిద్దువు గానీ.. ముందు నీ ఇంట్లో హీరో గురించి ప‌ట్టించుకో` అని పూరికి హిత‌వు ప‌లుకుతున్నాడు బండ్ల గ‌ణేష్‌.

 

పూరి త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌ను హీరోగా `చోర్ బ‌జార్‌` రూపొందింది. ఈ సినిమా శుక్ర‌వారం విడుద‌ల అవుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో పూరి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. త‌నేమో త‌న షూటింగ్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. పూరి వ‌ల్ల ఎదిగిన హీరోలు, పూరి వ‌ల్ల హిట్లు కొట్టిన హీరోలు కూడా ఈ సినిమాని ప్ర‌మోట్ చేయ‌డానికి ముందుకు రావ‌డం లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ తో హీరో రామ్ కి పూరి ఓ హిట్టు ఇచ్చాడు. త‌న‌ని చోర్ బ‌జార్ ప్ర‌మోష‌న్ల‌కు ర‌మ్మంటే.. రాలేద‌ట‌. అందుకే... చోర్ బ‌జ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశాడు. పూరి వల్ల చాలామంది ఎదిగార‌ని, పూరి త‌న సొంత కొడుకుని ప‌ట్టించుకోనంత బిజీ అయ్యాడ‌ని, పూరి ఆ త‌ప్పు చేయ‌కుండా.. ఇక‌నైనా మిగిలిన హీరోల గురించి ఆలోచించ‌కుండా, ఆకాష్ గురించి ఆలోచించాల‌ని బండ్ల స‌ల‌హా ఇచ్చాడు. ఇదంతా రామ్ ని ఉద్దేశించి చేసిన కామెంట్లే అంటూ... టాలీవుడ్ లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ నడుస్తోంది.

ALSO READ: బ‌న్నీకి అర్జెంటుగా ఓ క‌థ కావ‌లెను!