ENGLISH

స‌ల్మాన్ విల‌న్‌గా జ‌గ్గూ భాయ్‌!

23 June 2022-11:06 AM

లెజెండ్‌తో జ‌గ‌ప‌తిబాబు కాస్త జ‌గ్గూభాయ్‌గా మారిపోయాడు. విల‌న్ అవ‌తారం ఎత్త‌డం.. త‌న కెరీర్‌లో తీసుకొన్న గొప్ప నిర్ణ‌యాల్లో ఒక‌టిగా మారిపోయింది. అప్ప‌టి నుంచీ అస‌లు వెన‌క్కి తిరిగి చూసుకోనే అవ‌కాశ‌మే లేదు. యేడాదికి ప‌ది ప‌దిహేను సినిమాల‌తో బిజీ అయిపోయాడు. హీరోగా కంటే విల‌న్ గా ఎక్కువ సంపాదిస్తున్నాడు. తెలుగులోనే కాదు, ద‌క్షిణాదిన అన్ని భాష‌ల్లోనూ జ‌గ‌ప‌తిబాబు బిజీనే. ఇప్పుడు బాల‌వుడ్ లోనూ విల‌న్ గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. అది కూడా స‌ల్మాన్ ఖాన్ సినిమాతో.

 

స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న చిత్రం క‌భీ ఈద్ - క‌భీ దివాలీ. ఇందులో వెంక‌టేష్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే క‌థానాయిక‌. రామ్ చ‌ర‌ణ్ ఓ పాట‌లో త‌ళుక్కున మెర‌వ‌బోతున్న‌ట్టు టాక్. ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా జ‌గ‌ప‌తిబాబుకి ఎంచుకొన్నార‌ని తెలుస్తోంది. విల‌న్ పాత్ర‌లో జ‌గ్గూభాయ్‌ని తీసుకోవాల‌ని స్వ‌యంగా స‌ల్మాన్ ఖాన్ సూచించాడ‌ట‌. దాంతో... జ‌గ‌ప‌తికి ఎంట్రీ దొరికేసింది. స‌ల్మాన్ సినిమాలో విల‌న్ పాత్ర అంటే.. పాన్ ఇండియా గుర్తింపు ద‌క్కిన‌ట్టే. ఏదేమైనా స‌ల్మాన్ ఇప్పుడు త‌న టీమ్ లో ఎక్కువ‌మంది సౌత్ ఇండియ‌న్ స్టార్ల‌ని తీసుకోవ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ గ్యాంగ్ ని చూస్తుంటే స‌ల్మాన్ చేస్తోంది హిందీ సినిమానా, తెలుగు సినిమానా అనే డౌటు వేయ‌క మాన‌దు.

ALSO READ: బ‌న్నీకి అర్జెంటుగా ఓ క‌థ కావ‌లెను!