ENGLISH

ఒకే రోజు.... 9 సినిమాలు

23 June 2022-12:00 PM

టాలీవుడ్ కి కొత్త క‌ళ వ‌చ్చింది. ప్ర‌తీ వారం గంపెడు సినిమాలు వ‌స్తూ పోతూ ఉన్నాయి. ఈ శుక్ర‌వారం అయితే ఏకంగా 9 సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. అన్నీ చిన్న సినిమాలే అయినా, వాటిలో కొన్నింటికి వివిధ కార‌ణాల వ‌ల్ల క్రేజ్ వ‌చ్చింది.

 

కిర‌ణ్ అబ్బ‌వ‌ర‌పు - `స‌మ్మ‌త‌మే`, పూరి ఆకాష్ `చోర్ బ‌జార్‌`ల‌పై సినీ ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల దృష్టి గ‌ట్టిగా ప‌డింది. వీటితో పాటు ఆర్జీవీ - కొండా, ఎమ్మెస్ రాజు 6 డేస్ 7 నైట్స్ ఈ వార‌మే విడుద‌ల కాబోతున్నాయి.

 

వీటితో పాటుగా... స‌దా న‌న్ను న‌డిపే, క‌ర‌ణ్ అర్జున్‌, గ్యాంగ్ స్ట‌ర్ గంగ‌రాజు, పెళ్లి కూతురు పార్టీ, సాఫ్ట్ వేర్ బ్లూస్ ఈ వార‌మే విడుద‌ల కాబోతున్నాయి. అన్నీ చిన్న సినిమాలే. కాబ‌ట్టి... ప్ర‌తీ సినిమాకీ కొన్ని థియేట‌ర్లు దొరికాయి. ఇప్ప‌టికే విక్ర‌మ్‌, ఎఫ్ 3, విరాట‌ప‌ర్వం కొన్ని థియేట‌ర్ల‌లో ఆడుతున్నాయి. ఆయా చిత్రాల ఫైన‌ల్ ర‌న్ దాదాపుగా పూర్త‌య్యింది. కాబ‌ట్టి.. ఈ వారం ప్రేక్ష‌కులు కొత్త సినిమాలపై దృష్టి పెట్టొచ్చు.

ALSO READ: బ‌న్నీకి అర్జెంటుగా ఓ క‌థ కావ‌లెను!