ENGLISH

రౌడీతో 'జ‌న‌గ‌న‌మ‌న‌' పాడిస్తాడా?

28 January 2022-17:48 PM

పూరి జ‌గ‌న్నాథ్ క‌ల‌ల చిత్రం `జ‌న‌గ‌ణ‌మ‌న‌`. దేశ భ‌క్తి నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ఈ క‌థ‌ని ఇది వ‌ర‌కు మ‌హేష్ బాబుకి వినిపించాడు. అన్నీ ఓకే అనుకున్న త‌రువాత‌.. కొన్ని అనుకోని కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌లేదు. అప్ప‌టి నుంచీ ఈ క‌థ పూరి ద‌గ్గ‌ర అలానే వుంది. ఇప్పుడు ఇదే క‌థ‌ని.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేయ‌బోతున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

 

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో `లైగ‌ర్` తీస్తున్నాడు పూరి. ఈ సినిమా బాగా వ‌స్తోంద‌ని టాక్‌. ఈ చిత్రానికి క‌ర‌ణ జోహార్ కూడా ఓ నిర్మాత‌. ఆయ‌నేమో పూరినీ, విజ‌య్ నీ మ‌ళ్లీ క‌ల‌పాల‌ని చూస్తున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ తో పూరి మ‌రో సినిమా చేయ‌బోతున్నాడ‌ని, దీనికి క‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని.. టాక్‌. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ క‌పూర్ ని ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. ఈ క‌థ‌.. మ‌హేష్ తో చేయాల్సిన `జ‌గ‌న‌ణ‌మ‌న‌` అని, పాన్ ఇండియా సినిమాగా రూపొందించే ఛాన్స్ ఈ క‌థ‌కి ఉంద‌ని, అందుకే ఈ క‌థ‌ని సెలెక్ట్ చేసుకున్నాడ‌ని స‌మాచారం. అలా.. మ‌హేష్ కోసం రాసుకున్న క‌థ‌ని, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో వ‌ర్క‌వుట్ చేయిస్తున్నాడ‌న్న‌మాట‌.

ALSO READ: చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కంట్రోల్ త‌ప్పుతున్నారా?