ENGLISH

హే రామ్‌... షారుఖ్ ఖాన్ కి ఏమైంది?

28 January 2022-18:00 PM

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్‌. చిన్న స్థాయి నుంచి సూప‌ర్ స్టార్ గా ఎదిగాడు. బాలీవుడ్ లో సంచ‌ల‌న విజ‌యాల‌కు మారుపేరుగా నిలిచాడు. అయితే కొంత‌కాలంగా షారుఖ్ కి టైమ్ క‌ల‌సి రావ‌డం లేదు. అన్నీ ఫ్లాపులే. మామూలు ఫ్లాపులు కాదు. ఏకంగా డిజాస్ట‌ర్లు. మిగిలిన హీరోలంతా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంటే షారుఖ్ మాత్రం పూర్తిగా త‌డ‌బ‌డుతున్నాడు. త‌న క్రేజ్ కి కొద్ది కొద్దిగా బీట‌లు వారుతున్నాయి. అందుకే కెరీర్ ప‌రంగా కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడో సినిమాని రీమేక్ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు ప్రారంభించాడ‌ట‌. ఆ సినిమానే హే రామ్‌.

 

క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ నిర్మించిన చిత్రం హేరామ్‌. అప్ప‌ట్లో వివాదాస్ప‌ద‌మైంది. అనేక సంచ‌న‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువు అయ్యింది. అయితే.. ఈ సినిమా అతి పెద్ద డిజాస్ట‌ర్‌. నిర్మాత‌గా క‌మ‌ల్ చాలా న‌ష్ట‌పోయాడు. ఇప్పుడు ఈ సినిమాని షారుఖ్ రీమేక్ చేయాల‌నుకోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. సూప‌ర్ హిట్ సినిమాని రీమేక్ చేయాల‌నుకోవ‌డం వేరు. సూప‌ర్ ఫ్లాప్ సినిమా జోలికి ఎందుకు వెళ్తున్నాడో? అన్న‌ట్టు హే రామ్ లో షారుఖ్ ఓ అతిథి పాత్ర‌లో క‌నిపించాడు. ఇప్పుడు క‌మ‌ల్ ని గెస్ట్ రోల్ కి ఒప్పిస్తాడేమో చూడాలి.

ALSO READ: చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కంట్రోల్ త‌ప్పుతున్నారా?