ENGLISH

సంక్రాంతికి మళ్ళీ పుష్ప రాజ్ రాక

08 January 2025-17:59 PM

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో మూవీ 'పుష్ప 2 ' ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ సాధించింది. కలక్షన్ల మోత మోగిస్తూనే ఉంది. రీసెంట్ గా బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసి, ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక కలక్షన్స్ సాధించిన మూవీగా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అయినా పుష్ప రాజ్ దాహం ఇంకా తీరలేదు. రిలీజ్ అయిన నెలరోజులకే 1800 కోట్లు కొల్లగొట్టిన పుష్ప 2 మూవీ సంక్రాంతి బరిలో కూడా నిలవనుంది. అదేంటి మళ్ళీ సంక్రాంతి బరిలో నిలవటం ఏంటి అనుకుంటున్నారా? అవును తగ్గేదేలే అని పుష్ప 2 మళ్ళీ సంక్రాంతికి  కొత్తగా ముస్తాబు అయ్యి రానుంది.

ఇప్పటికే సంక్రాంతికి మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి. అంతా స్టార్ హీరోలు, దర్శకులే. వీటికోసం థియేటర్స్ పోటీ పడుతున్నాయి. నార్త్ లో మాత్రం ఇంకా పుష్ప 2 థియేటర్స్ హవా తగ్గలేదు. మిగతా చోట్ల కొంచెం పుష్ప రాజ్ హవా తగ్గుతున్న టైంలో కొత్త ప్లాన్ తో వస్తున్నారు మేకర్స్. పుష్ప 2 సినిమాలో కొత్తగా కొన్ని సీన్స్ యాడ్ చేసి, 20 నిముషాలు నిడివి పెంచి మళ్ళీ జనవరి 11 న థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. దీంతో ఈ న్యూస్ బన్నీ ఫాన్స్ కి ఆనందం తెచ్చిపెడితే. మిగాతా సినిమాలకి షాక్ ఇచ్చినట్లు అయ్యింది.

సంక్రాంతి సినిమాలకే థియేటర్స్ దొరకటం లేదు అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త సొగసులతో పుష్ప 2 రిలీజ్ చేయటమేంటని, దీనికి థియేటర్స్ ఎలా ఇస్తారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 3  గంటలు ఉన్న ఈ సినిమా నిడివి ఇంకో 20 నిముషాలు పెంచటం, మళ్ళీ రిలీజ్ చేయటం సంక్రాంతి సినిమాలను టార్గెట్ చేయటమే అని మండి పడుతున్నారు. ఈ సారి దంగల్ రికార్డ్ బ్రేక్ చేయటం గ్యారంటీ అని ఫాన్స్ సంతోషంగా ఉన్నారు.

ALSO READ: సంక్రాంతికి లక్ టెస్ట్ చేసుకుంటున్న ముద్దు గుమ్మలు