'పుష్ప 2' ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాట కారణంగా రేవంత్ సర్కార్ ఇక నుంచి బెనిఫిట్ షో లు ఉండవు, టికెట్స్ రేట్లు పెంపు కూడా ఉండదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో టికెట్స్ రేట్లు పెంపు గూర్చి తెలంగాణా సర్కార్ కి దిల్ రాజు లెటర్ రాసారు. ఈ నేపథ్యంలో 'గేమ్ చేంజర్' మూవీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన జీవో జారీ చేసింది తెలంగాణ సర్కార్. గేమ్ చేంజర్ మూవీ ఆరు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. కానీ బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వలేదు.
గేమ్ చేంజర్ మూవీ జనవరి 10 న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నైట్ బెనిఫిట్ షో లు లేకపోయినా ఉదయం నాలుగు గంటల నుంచి షోలు వేయనున్నారు. మూవీ రిలీజ్ రోజు టికెట్ పై మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 100 రూపాయలు పెంచుకోవటానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. జనవరి 11 నుంచి 19 వరకు 9 రోజుల పాటు టికెట్ రేటు మీద మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 పెంచుకునేలా పర్మిషన్ దొరికింది. తెలంగాణలో జనవరి 9 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి.
ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి టికెట్స్ రేటు పెంపు పర్మిషన్ రావటంతో డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ కి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది అని నిర్మాతలు కొంచెం ఊరట చెందారు. కానీ బెనిఫిట్ షో లేకపోవటం నిరాశ మిగిల్చింది. 'పుష్ప2 'కి ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. టికెట్స్ రేట్లు కూడా భారీగా పెంచారు. ప్రీమియర్ షోలకు టికెట్ పై 800 పెంచారు. దాంతో మల్టీప్లెక్స్ లో టికెట్ 1200 . సింగిల్ స్క్రీన్లలో 1000 దాటింది. రిలీజ్ రోజు మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 200, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 150 పెంచారు.
Telangana Ticket Hike and Extra shows for #GameChanger pic.twitter.com/8tJsASl99T
— Suresh PRO (@SureshPRO_) January 8, 2025
ALSO READ: సంక్రాంతికి మళ్ళీ పుష్ప రాజ్ రాక