రేపే పుష్ఫ విడుదల. అభిమానులంతా ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ దశలో.. పుష్ఫ హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. పుష్ఫ పాన్ ఇండియా సినిమా అనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగులో తప్ప ఏ భాషలోనూ పుష్ఫ అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. హిందీలో ఈ సినిమా ఇంకా సెన్సార్ అవ్వలేదు. దానికి కారణం.. కొన్ని టెక్నికల్ రీజన్స్. పుష్ఫ హిందీ సెన్సార్ కాపీలో... ఆర్.ఆర్ సింక్ అవ్వలేదట. దాంతో... ఈ సినిమాని సెన్సార్ చేయలేమని సెన్సార్ బోర్డు తోసిపుచ్చింది.
ఇప్పుడు ఆ కరక్షన్లు చేసి కొత్త కాపీ పంపుతున్నారు. ఈ రోజు ఉదయం హిందీ వెర్షన్ సెన్సార్ పూర్తయ్యే ఛాన్సుంది. సో.. హిందీ లో ఈ సినిమా విడుదల అవుతుంది. మిగిలిన భాషల్లోనూ ఇదే పరిస్థితి. చివరి నిమిషాల్లో టెన్షన్ ఉన్నా సరే, ఈ సినిమాని కచ్చితంగా అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తామని చిత్రబృందం చెబుతోంది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మూడో సినిమా ఇది. రెండు భాగాలుగా విడుదల అవుతోంది. రష్మిక కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సమంత ఓ ప్రత్యేక గీతంలో కనువిందు చేయబోతున్న సంగతి తెలిసిందే.
ALSO READ: లైగర్ రిలీజ్ డేట్ ఫిక్స్