ENGLISH

పుకార్ల‌ని ఖండించిన‌ పీపుల్స్ స్టార్

15 July 2021-14:40 PM

గ‌త కొన్ని రోజులుగా ఆర్‌.నారాయ‌ణ‌మూర్తిపై ర‌క‌ర‌కాల వార్త‌లొస్తున్నాయి. నారాయ‌ణ‌మూర్తి ఆర్థిక ప‌రిస్థితి ఏం బాగాలేద‌ని, క‌నీసం ఇంటి అద్దె కూడా క‌ట్టుకోలేని ప‌రిస్థితిలో ఉన్నార‌ని, అందుకే ఆయ‌న హైద‌రాబాద్ కి దూరంగా ఓ ప‌ల్లెటూరులో ఉంటున్నార‌న్న‌ది ఆ వార్త‌ల సారాంశం. దీనిపై పీపుల్స్ స్టార్ స్పందించారు.

 

``పల్లెటూరి వాతావరణంలో గడపడం ఇష్టం కాబట్టే సిటికి దూరంగా ఉంటున్నా. ఆటోలో రాకపోకలకే నెలకు రూ.30 వేలు ఖర్చవుతాయి, ఇంటి అద్దె కట్టుకోలేనా? సోషల్ మీడియాలో అవాస్తవాలు రాయడం వల్ల నా మనసుకు బాధ కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆర్థిక సహాయం చేస్తామంటే కన్నీళ్లు వస్తున్నాయి. కోట్లు సంపాదించా, నా వరకు సరిపడ దాచుకున్నా, మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చా`` అని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం రైతుల స‌మ‌స్య‌పై ఓ సినిమా తీస్తున్నారు నారాయ‌ణ మూర్తి. త్వ‌ర‌లోనే అది విడుద‌ల కాబోతోంది. ఒరేయ్ రిక్షా, చీమ‌ల‌దండు, ఎర్ర సైన్యం.. లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్లు ఇచ్చారు నారాయ‌ణ‌మూర్తి. ఆ సినిమాల‌తో కోట్లు సంపాదించారు. అయితే.. ఆ సొమ్మునంతా మ‌ళ్లీ సినిమాల్లోనే పెట్టారు. అతి సాధార‌ణ‌మైన జీవితం గ‌డ‌ప‌డం నారాయ‌ణ‌మూర్తికి ఇష్టం. ఎక్క‌డికైనా స‌రే, న‌డిచే వెళ్లిపోతారు. అందుకే.. ఆయ‌న ఆర్థిక ప‌రిస్థితిపై ర‌క‌ర‌కాల వార్త‌లొస్తుంటాయి. అందులో ఇదొక‌టి అనుకోవాలంతే.

ALSO READ: చిన్న‌ప్ప‌టి స‌మంత‌గా... అల్లు అర్జున్ కుమార్తె?