ENGLISH

రాశీఖ‌న్నా.. సైకోకిల్ల‌ర్‌గా మారిందా?

16 June 2021-16:00 PM

ఓటీటీల వ‌ల్ల చాలా ఉప‌యోగాలు ఏర్ప‌డ్డాయి. థియేట‌ర్లు బంద్ అయిన‌ప్పుడ‌ల్లా.. ఓటీటీలు క‌ల్ప‌త‌రువులుగా క‌నిపిస్తున్నాయి. ప్ర‌యోగాలు చేయ‌డానికి ఇదో మంచి వేదిక అయిపోయింది. ముఖ్యంగా క‌థానాయిక‌ల‌కు. వెండి తెర‌పై చేయ‌లేని పాత్ర‌ల్ని.. ఓటీటీ తెర‌ల‌పై చేసేస్తున్నారు. ఇటీవ‌ల రాజీగా అల‌రించింది.. స‌మంత‌. బ‌హుశా.. సిల్వ‌ర్ స్క్రీన్ పై ఇలాంటి అవ‌కాశం అయితే త‌న‌కు వ‌చ్చి ఉండేది కాదేమో..? ఆ అవ‌కాశాన్ని స‌మంత స‌ద్వినియోగం చేసుకుంది. ఇప్పుడు రాశీ ఖ‌న్నాకీ అలాంటి ఛాన్సు వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

 

ఈమ‌ధ్య రాశీఖన్నా కూడా ఓటీటీల‌పై దృష్టి పెట్టింది. కొన్ని వెబ్ సిరీస్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. షాహిద్ క‌పూర్ తో క‌లిసి త‌ను ఓ వెబ్ సిరీస్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు.. అజ‌య్ దేవ‌గ‌ణ్ తో కూడా ఓ సిరీస్ చేస్తోంది. డిస్నీ హాట్ స్టార్ కోసం రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో అజ‌య్‌,... పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతోంటే, రాశీ సైకో కిల్ల‌ర్ పాత్ర‌లో ద‌ర్శ‌నం ఇవ్వ‌బోతోంద‌ట‌. ఈ త‌ర‌హా పాత్ర చేయ‌డం... రాశీకి ఇదే తొలిసారి. ఈ సిరీస్ అంతా రాశీ సీరియ‌స్ లుక్ లో ఉంటుంద‌ని, షూటింగ్ పూర్త‌యిపోయింద‌ని, జులై 21 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది.

ALSO READ: ప‌వ‌న్‌కి మంత్రి ప‌ద‌వి... ఢిల్లీలో ఊహాగానాలు