ENGLISH

రాధికా ఆప్టేకి ఇదేం కొత్తకాదుగా!

10 March 2018-11:30 AM

ముద్దుగుమ్మ రాధికా ఆప్టే చేసేవి తక్కువ సినిమాలే అయినా కానీ వివాదాలు మాత్రం ఎక్కువే ఈ ముద్దుగుమ్మకి. ఏదో ఒక రకంగా వివాదాలతో సావాసం చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అందాల భామ బీచ్‌లో ఓ ఫోటోకి పోజిచ్చి ఆ ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. మామూలు బీచ్‌ ఫోటో అయితే ఏముంటుంది కిక్కు. అందుకే తన బోయ్‌ ఫ్రెండ్‌తో బికినీలో ఉన్న ఫోటో అది. 

ఆ ఫోటోలో రాధికా ఆప్టేని అలా చూస్తే, నెటిజన్లు ఊరికే ఉంటారా? వారికి నచ్చిన రీతిలో కామెంట్లు గుపించారు. దాంతో మన ముద్దుగుమ్మ ఏమైనా తక్కువ తింటుందా? వారికి తగ్గట్లుగానే ధీటుగా సమాధానమిస్తుంది. అదే జరిగింది. నెగిటివ్‌ కామెంట్స్‌ని ఎదుర్కోవడానికి పాపం ఈ భామ అస్సలు సిగ్గు పడదు. అందుకే ఇదిగో ఇలా స్పందించింది. కామెంట్‌ చేసిన వారు ఎవరో నాకు తెలియదు కానీ, ఒకవేళ నేను బీచ్‌లో బికినీలు కాకుండా చీరలు కట్టుకుని తిరగాలన్నది వారి ఉద్దేశ్యమా.. అయినా ఇలాంటి కామెంట్స్‌ చేసేవారిని నేనస్సలు పట్టించుకోను..' అని ఘాటుగా సమాధానమిచ్చింది. 

సోషల్‌ మీడియాలో సెలబ్రిటీస్‌కి ఇలాంటి కామెంట్స్‌ మామూలే. అయితే తిరిగి ఆ సెలబ్రిటీస్‌ స్పందిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. అయితే అందరూ ఈ తరహా కామెంట్స్‌కి స్పందించరు. ఇదిగో రాధికా ఆప్టేలాంటి కొందరు భామలు మాత్రమే స్పందిస్తూ ఉంటారు. గతంలో పలువురు హీరోయిన్లు ఇలాంటి కామెంట్స్‌ని ఎదుర్కొన్నవాళ్లే. అయితే రాధికా ఆప్టేలా వాళ్లు స్పందించలేదు అంతే తేడా!

ALSO READ: అఖిల్‌కి ఓ క్లారిటీ వచ్చిందా?