ENGLISH

'రంగమ్మ మంగమ్మ' సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తోందంతే..!

10 March 2018-10:30 AM

మూడు ఆడియో సింగిల్స్‌ వచ్చాయి ఇంతవరకూ. మూడు ఆడియో సింగిల్స్‌ మంచి రెస్పాన్స్‌ అందుకుంటున్నాయి. ఈ మూడింట్లోనూ 'ఎంత సక్కగున్నావే' సాంగ్‌ టాప్‌ ప్లేస్‌. రెండో సాంగ్‌ 'రంగా..రంగా రంగస్థలాన' సాంగ్‌ ఫోక్‌ సాంగ్‌. ముచ్చటగా, మూడో సాంగ్‌గా విడుదలైన తాజా సాంగ్‌ 'రంగమ్మ.. మంగమ్మ..' సాంగ్‌ కూడా డిఫరెంట్‌ సాంగే. 

తొలి సాంగ్‌లో హీరోయిన్‌ని హీరో పొగుడుతూ పాడితే, ఈ తాజా సాంగ్‌లో హీరోయిన్‌, హీరోని టీజ్‌ చేస్తూ కనిపిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 23 లక్షల వ్యూస్‌ని దాటేసిందీ సాంగ్‌. సాంగ్‌ వీడియోలోని చరణ్‌ - సమంత స్టిల్స్‌ చాలా బాగున్నాయి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. సమంత క్యూట్‌ అండ్‌ నాటీ ఎక్స్‌ప్రెషన్స్‌, పల్లెటూరి అమ్మాయిగా లంగా వోణీతోనూ, చీరకట్టుతోనూ, అందంగా ఆకట్టుకుంటోంది. అచ్చు, ఎంకీ, నాయుడు బావలా భలే చూడ ముచ్చటగా కనిపిస్తోందీ జంట. 

సాంగ్‌ ప్రోమో స్టిల్స్‌లోనే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక సినిమాలో చరణ్‌ - సమంత నేచురల్‌ గెటప్స్‌లో ఇంకెంతగా ఆకట్టుకోనున్నారో. టోటల్‌ ఆడియోలో ఆరు సాంగ్స్‌ అనుకుంటే, ఆల్రెడీ విడుదలైన మూడు సాంగ్స్‌ సూపర్‌ హిట్‌ టాక్‌ని సొంతం చేసుకున్నాయి. ఇక రానున్న మూడు సాంగ్స్‌ ఏ రికార్డుల్ని సొంతం చేసుకుంటాయో. అందులోనూ స్పెషల్‌ సాంగ్‌పై మరీ అంచనాలున్నాయి. ఈ స్పెషల్‌ సాంగ్‌లో ముద్దుగుమ్మ పూజా హెగ్దే నటించింది. జానీ మాస్టర్‌ అదిరిపోయే మాస్‌ స్టెప్పులు కంపోజ్‌ చేశారు ఈ స్పెషల్‌ సాంగ్‌కి. 

మొత్తానికి దేవిశ్రీ ప్రసాద్‌ 'రంగస్థలం' సినిమాకి అందించిన ట్యూన్స్‌ తన మ్యూజిక్‌ కెరీర్‌లోనే అత్యంత డిఫరెంట్‌ ట్యూన్స్‌గా చెప్పొచ్చు. 

ALSO READ: తాజా సంచలనం: షకీలా పాత్రలో రిచా

ALSO READ: Qlik Here Rangamma Mangamma Song