ENGLISH

విజయ్‌ దేవరకొండ సుడిగాడే

10 March 2018-09:30 AM

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ చాన్నాళ్ల క్రితం నటించిన సినిమా 'ఏ మంత్రం వేశావే'. అందరూ మర్చిపోయిన సినిమాని ఇప్పుడు రిలీజ్‌ చేశారు. విజయ్‌ దేవరకొండ తప్ప ఈ సినిమాలో ఇంకెవరూ తెలియదు. అంతా కొత్తవాళ్లే. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల్లో ధియేటర్స్‌ బంద్‌తో సినిమాకి ముఖం వాచిపోయి ఉన్నారు ప్రేక్షకులు. 

అలాంటిది ఈ రోజు ఫ్రెష్‌గా విడుదలైన ఈ సినిమాకి జనం పోటెత్తారు. అయినా 'అర్జున్‌రెడ్డి' సినిమాతో అసలే మనోడు మంచి సక్సెస్‌ జోరు మీదున్నాడు. దాంతో విజయ్‌ దేవరకొండ నటించిన 'ఏ మంత్రం వేశావె' సినిమా ప్రదర్శితమవుతోన్న ధియేటర్స్‌ వద్ద క్రౌడ్‌ బాగా కనినిపించింది. అనూహ్యంగా ఈ సినిమాకి ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయి. 'సుడి' అంటే ఇలాగే ఉండాలి. 'అర్జున్‌రెడ్డి'తో సెన్సేషనల్‌ విజయం అందుకున్న విజయ్‌ దేవరకొండ ఈ సినిమాతో కూడా అలాంటి సెన్సేషనే నమోదు చేసేలా ఉన్నాడు. 

ఓవర్సీస్‌లో కూడా విజయ్‌ దేవరకొండకు మంచి క్రేజ్‌ ఉంది. దాంతో 'ఏ మంత్రం వేశావె' సినిమా విడుదలకు ముందు సంగతి ప్రమోషన్స్‌ సంగతి అటుంచితే, విడుదలైన తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అంచనాలు పెంచేస్తోంది. వీడియో గేమ్స్‌ తరహాలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కాక విజయ్‌ చేతిలో చాలానే చిత్రాలున్నాయి. అందులో ఒకటి బిగ్‌ అండ్‌ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ 'మహానటి'. 

ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఇది కాక విజయ్‌ హీరోగా మరో రెండు చిత్రాలు తెరకెక్కనున్నాయి. తాజాగా విజయ్‌ చేతికి చిక్కిన మరో క్రేజీ ప్రాజెక్ట్‌ 'నోటా'. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'నోటా'.

 

ALSO READ: తాజా సంచలనం: షకీలా పాత్రలో రిచా