సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలంటే తెర వెనుక చాలా కష్టపడాల్సి ఉంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. కానీ ఈ విషయంలో ఎవ్వరూ నోరు విప్పరు. అయితే అనూహ్యంగా ఈ మధ్య ముద్దుగుమ్మలు ఒకానొక టైంలో ఈ కాస్టింగ్ కౌచ్ విషయంలో సీరియస్‌గా నోరు జారేస్తున్నారు. మొన్నామధ్య స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ విషయంలో సీరియస్‌గా క్లాస్ తీసుకుంది. అయితే తానింతవరకూ అలాంటి అనుభవం ఫేస్ చేయలేదని తెలివిగా ఎస్కేప్ అయ్యింది.
నిన్నేమో బెల్లీ బేబ్ ఇలియానా కూడా ఈ విషయంపై నోరు విప్పింది. సినీ రంగంలో హీరోయిన్స్‌కి కాస్టింగ్ కౌచ్ పెద్ద తంటాగా మారిందని ఆ విషయంలో హీరోయిన్లు నోరు విప్పితే, ఆ రోజుతో వారి కెరీర్ క్లోజ్ అనీ, అలాగే హీరోయిన్స్‌పై ఈ లైంగిక వేధింపులు అనే సమస్యని పూర్తిగా రూపుమాపాలంటే, ఈ సమస్యను ఎదుర్కొన్న, ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలువురు నటీమణులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యల్ని అభిమానులతో పంచుకోవాలనీ అబ్బో పెద్ద క్లాసే తీసుకుందిలెండి. తాజాగా ఈ సమస్యపై మరో అందాల భామ తన గళం వినిపించింది.
ఈ ముద్దుగుమ్మ అసలే డేరింగ్ అండ్ డాషింగ్. గతంలోనూ ఈ విషయంలో పబ్లిగ్గా తన అనుభవాన్ని చెప్పేసింది కూడా. ఓ టాలీవుడ్ స్టార్ హీరోపై తీవ్రంగా ఆరోపణలు చేసిందీ బ్యూటీ. అవే ఆరోపణలు మరోసారి గుర్తు చేసుకుంటోంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరా అనేగా, ఇంకెవరు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాధికా ఆప్టే. తెలుగులో చేసింది చాలా తక్కువ చిత్రాలు. అందులో రెండు చిత్రాలు బాలయ్యబాబుతోనే నటించింది. అలాంటిది ఈ అమ్మడు సౌత్ సినిమాపై చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావండోయ్. తాజాగా కూడా అదే బాజా మోగిస్తోంది. అసలింతకీ ఈ అందాల భామలకు ఏమైంది.!
ALSO READ: కర్తవ్యం తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్