ENGLISH

దటీజ్‌ రాజమౌళి స్ట్రేటజీ.!

30 January 2020-10:36 AM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'కి సంబంధించి షూటింగ్‌ అప్‌డేట్స్‌ లేకున్నా, ఎప్పటికప్పుడే ఏదో మ్యాజిక్‌ చేస్తూ, అప్‌డేట్‌ ఇస్తున్నామనే భ్రమ కలిగిస్తున్నాడు రాజమౌళి. 75 శాతం సినిమా షూటింగ్‌ పూర్తయ్యిందంటున్నారు కానీ, ఇంతవరకూ రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ లుక్స్‌ మాత్రం అధికారికంగా రిలీజ్‌ కాలేదు. క్యారెక్టర్స్‌ పేర్లు రివీల్‌ చేస్తున్నాడు. కానీ, వారి పాత్రల తాలూకు గెటప్స్‌ రిలీజ్‌ చేయడంలో రాజమౌళి చాలా గోప్యం వహిస్తున్నాడు. తాజాగా నెట్టింట్లో కొన్ని ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవగణ్‌తో పాటు, రాజమౌళి ఆ ఫోటోస్‌లో కనిపిస్తున్నారు.

 

రాజమౌళి తెలివితేటలు ఏంటో ఇక్కడే అర్ధం చేసుకోవచ్చు. ఆన్‌ సెట్స్‌ ఫోటోస్‌లానే ఉన్నా, హీరోలు మాత్రం క్యాజువల్‌ లుక్స్‌లోనే కనిపిస్తున్నారు. అటవీ ప్రాంతంలో షూట్‌ చేసిన ఫోటోస్‌లా ఉన్నాయివి. కానీ, సినిమాకి సంబంధించి ఒరిజినల్‌ లుక్స్‌ కావు. లుక్స్‌ బయటికి రాకుండా రాజమౌళి తీసుకుంటున్న జాగ్రత్తలకు నిజంగా హ్యాట్సాఫ్‌ అనాల్సిందే. అయినా పాపం ఫ్యాన్స్‌ అల్ప సంతోషిలే కాబట్టి, ఈ లుక్స్‌కే తెగ పండగ చేసేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో హాలీవుడ్‌ భామ ఒలివియా మోరిస్‌, ఎన్టీఆర్‌కి జంటగా నటిస్తుంటే, బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ చరణ్‌తో జోడీ కడుతోంది.

ALSO READ: అభిమానికి కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చిన రౌడీ!