ENGLISH

రాజమౌళి రూటు మార్చేశాడట నిజమేనా?

18 June 2018-12:00 PM

రాజమౌళి సినిమా అంటే చాలా స్లోగా షూటింగ్‌ జరుగుతుంది. మెల్లమెల్లగా జక్కన్న తన చిత్రాన్ని చెక్కుతూనే ఉంటాడు. అందుకే ప్రీ ప్రొడక్షన్‌ పనులకీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకీ, మేకింగ్‌కీ చాలా టైం తీసుకుంటాడు. అయితే ఈ సారి పూర్తిగా రూటు మార్చాడట. 

చరణ్‌ - ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో తీయబోయే మల్టీ స్టారర్‌ని కొత్త కొత్తగా ప్లాన్‌ చేస్తున్నాడట. ఒక్కసారి సినిమా సెట్స్‌ మీదికి వెళితే, శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసి, విడుదల చేసే యోచనలో ఉన్నాడట రాజమౌళి. నవంబర్‌లో సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుందని సమాచారమ్‌. తర్వాత ఆరు నుండి ఎనిమిది నెలలలోపు సినిమా షూటింగ్‌ పూర్తి కానుందట. చరణ్‌, ఎన్టీఆర్‌ ఇద్దరూ డేట్స్‌ విషయమై జాగ్రత్తలు తీసుకుంటున్నారట. 

రాజమౌళి షెడ్యూల్స్‌ కన్‌ఫామ్‌ చేస్తే ఇద్దరూ రంగంలోకి దిగడమే తరువాయి. ఇదొక కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అట. ఈ సినిమాకి కూడా 'బాహుబలి' రేంజ్‌లో కాకపోయినా, ఓ రేంజ్‌లో గ్రాఫిక్స్‌ ఉంటాయనీ గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. అయితే గ్రాఫిక్స్‌ వ్యవహారాలు ఈ సినిమాలో అస్సలుండవనీ జక్కన్న కన్‌ఫామ్‌ చేసేశాడు. ఇప్పుడప్పుడే గ్రాఫిక్స్‌ జోలికి పోనని నిక్కచ్చిగా చెప్పేశాడు. 

ఇకపోతే చరణ్‌, ఎన్టీఆర్‌ సరసన నటించబోయే హీరోయిన్స్‌ కోసం ప్రస్తుతం వేట కొనసాగుతోంది. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చరణ్‌ - బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్‌ 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంతో బిజీగా ఉన్నాడు.
 

ALSO READ: 100 కోట్ల క్లబ్‌లోకి సల్మాన్‌ఖాన్‌ 'రేస్‌-3'