ENGLISH

వాళ్ళిద్దరికీ రాజమౌళి గుడ్ లక్ చెప్పాడు

09 March 2018-18:19 PM

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం అంటే ఎంత ఇష్టం అనేది మనందరికీ తెలిసిందే. ఇక ఆయన ఖాళీ సమయాల్లో ఎక్కువగా చూసేది స్పోర్ట్స్ అని చాలా సందర్భాలో ఆయన చెప్పడం చూశాం.. 

ఇక తాజాగా ఆయన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు & శ్రీకాంత్ లను ఆయన ఈరోజు కలిశారు. ఇక వీరిరువురు త్వరలో జరగబోయే అల్ ఇంగ్లాండ్ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ కి వెళ్ళనున్నారు. ఈ తరుణంలో ఆయన వారిని కలవడం ఈ ఛాంపియన్ షిప్ కి గుడ్ లక్ చెప్పడం జరిగాయి. 

దీనికి సంబంధించిన ఫోటోని కూడా ఆయన తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు. ఇక ఇదే కాకుండా ఆయన మన దేశానికి సంబంధించి ఏదైనా మంచి పరిణామాలు జరిగినప్పుడు రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూనే ఉంటారు.

మనం కూడా రాజమౌళి చెప్పినట్టుగానే సింధు, శ్రీకాంత్ లకి గుడ్ లక్ చెబుదాం..

 

ALSO READ: సుడిగాలి సుధీర్-రశ్మిల పెళ్లంట