ENGLISH

హీరో కుమార్తె హీరోయిన్‌గా తెరంగేట్రం

15 June 2017-11:59 AM

హీరో రాజశేఖర్‌ కుమారై శివాని హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనుందన్న వార్త చాలా కాలంగా వినిపిస్తోంది. హీరోయిన్‌గా తెరంగేట్రం చేసేందుకు ఈ ముద్దుగుమ్మ ఫుల్‌ మేకోవర్‌ అయ్యింది. తాజా తాజా ఫోటో క్లిప్పింగ్స్‌తో కుర్రకారుకు కిర్రాక్‌ పుట్టిస్తోంది. బాలీవుడ్‌ పాపులర్‌ ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రాకి డూప్‌లా ఉందంటూ శివానికి కాంప్లిమెంట్స్‌ కూడా దక్కేస్తున్నాయి ఈ పిక్స్‌తో. అయితే ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌ నుండి హీరోయిన్‌గా తన ట్రావెలింగ్‌ స్టార్ట్‌ చేయనుందట. రాజశేఖర్‌, జీవిత దంపతులు తెలుగుతో పాటు, తమిళ, మలయాల, కన్నడ చిత్రాల్లోనూ పాపులర్‌ అయిన వాళ్లే. అలాగే తమ కుమారై కూడా భాషతో సంబంధం లేకుండా అవకాశాన్ని బట్టి ఎక్కడైనా హీరోయిన్‌గా కొనసాగాలని అనుకుంటోందట. ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుండీ నటనపై మక్కువతోనే పెరుగుతూ వచ్చిందట. అందుకు తగ్గట్లుగానే తనని తాను మలచుకోవడం చిన్నతనం నుండే అలవర్చుకుందట శివాని. కూచిపూడి, భరతనాట్యం తదితర డాన్సుల్లో ప్రావీణ్యం కూడా ఉందట. ఇవన్నీ హీరోయిన్‌గా తనని ఓ స్థాయిలో నిలబెడతాయని ఆశిస్తోంది. హీరోయిన్‌గా తన తల్లి తండ్రుల పేరు నిలబెడతానని అంటోంది శివాని. అలాగే రాజశేఖర్‌, జీవితల చిన్న కుమారై శివాత్మిక కూడా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చే ఆలోచనలోనే ఉందట. అందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయట. ఆ అమ్మాయి కూడా తక్కువేం కాదు, అక్కలాగే యాక్టింగ్‌, సింగింగ్‌, కిక్‌ బాక్సింగ్‌లాంటి ఎక్స్‌ట్రా టాలెంట్స్‌తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసేందుకు వెయిటింగ్‌లో ఉందని సమాచారమ్‌. 

 

ALSO READ: బాలయ్య అన్ని లక్షలు పెట్టిండా