ENGLISH

'గరుడవేగ' రాజశేఖర్‌ కొత్త కొత్తగా

23 September 2017-12:54 PM

ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న తాజా సినిమా 'గరుడవేగ'. రాజశేఖర్‌ హీరోగా నటిస్తున్నారు. 'చందమామ కథలు' తదితర చిత్రాలతో జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు. ఈ సారి కొంచెం కొత్తగా ట్రై చేశాడు. రాజశేఖర్‌లాంటి యాక్షన్‌ హీరోని పట్టుకుని ఓ సూపర్బ్‌ యాక్షన్‌ మూవీని తెరకెక్కించాడు. ఆ మేకింగ్‌ ఎలా ఉందో టీజర్‌తో చెప్పేశాడు. హాలీవుడ్‌ స్థాయి మేకింగ్‌తో ఈ సినిమా తెరకెక్కిందని టీజర్‌ చూస్తుంటే అర్ధమవుతోంది. అయితే టీజర్‌లో మాత్రం హీరో రాజశేఖర్‌ అంత హుషారుగా కన్పించలేదు ఎందుకో. అదొక్కటీ మినహాయిస్తే మేకింగ్‌ పరంగా చాలా బాగుంటుందనే అంచనాలు ఏర్పడటానికి టీజర్‌ బాగా ఉపయోగపడ్తుంది ఈ టీజర్‌. పూజా కుమార్‌, రాజశేఖర్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఉంది. బాలీవుడ్‌ బ్యూటీ సన్నీలియోన్‌ ఐటమ్‌ సాంగ్‌ చేస్తోంది. ఈ సాంగ్‌ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది. సినిమాకి ఈ సాంగ్‌ ప్రధాన ఆకర్షణ కానుంది. పవర్‌ ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలకి పెట్టింది పేరైన రాజశేఖర్‌ సినిమాలకు ఈ మధ్య ఆదరణ తగ్గింది. అయితే ఈ సినిమాతో మళ్లీ రాజశేఖర్‌ ఫామ్‌లోకి వస్తాడనీ ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: Qlik Here For Garudavega Teaser