ENGLISH

రాజశేఖర్ కి మాతృవియోగం

27 September 2017-16:49 PM

ప్రముఖ నటుడు రాజశేఖర్ తల్లి ఆండాళ్‌ వరదరాజ్‌(82) ఇక లేరు.

కొంతకాలంగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఈమె ఈరోజు ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆండాళ్ పార్థివదేహాన్ని బంధుమిత్రుల సందర్శనార్ధం ఈరోజు సాయంత్రం వరకు హైదరాబాద్ లో ఉంచనున్నట్టు సమాచారం.

ఇక రేపు ఉదయం చెన్నైలో అంతిమసంస్కారాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆండాళ్ కి అయుదుగురు సంతానం కాగా, రాజశేఖర్ ఆమెకి రెండో సంతానం.

ఆండాళ్ వరదరాజ్ గారి అకాల మృతికి www.iqlikmovies.com తరపున తీవ్ర దిగ్బ్రాంతి తెలియచేస్తున్నాం.