ENGLISH

'కాలా' స్పీడ్‌ అదిరేలా..

09 June 2017-11:01 AM

రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'కాలా - కరికాలన్‌' ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు స్టార్ట్‌ అయ్యి ఎంతో కాలం గడవలేదు. కానీ సూపర్‌ ఫాస్ట్‌గా సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇప్పటికే ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ అయిపోయింది. సెట్‌లో రజనీకాంత్‌ ఎనర్జీకి చిత్ర యూనిట్‌ అంతా షాకవుతోంది. ఆ వయసేంటి, ఆ ఎనర్జీ ఏంటి అంటున్నారు. రజనీకాంత్‌తో పోటీ పడడం మా వల్ల కాని పని అవుతోందంటూ చిత్ర యూనిట్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. అదే సూపర్‌ స్టార్‌ అంటే. పా రంజిత్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'కబాలి' సినిమాని తెరకెక్కించిన డైరెక్టరే పా రంజిత్‌. అయినా కానీ కథని నమ్మి ఫెయిల్యూర్‌ డైరెక్టర్‌తో మళ్లీ సినిమా చేయడం వెనుక చాలా విషయం ఉందట. యదార్ధ గాధని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న చిత్రమిది. రజనీ గ్యాంగ్‌ స్టర్‌ పాత్రలో కనిపిస్తాడు ఈ సినిమాలో. రజనీ అల్లుడు ధనుష్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బడ్జెట్‌లో ఎక్కడా రాజీ పడకుండా ధనుష్‌ ఈ సినిమాని నిర్మించనున్నారట. హ్యూమా ఖురేషి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరో పక్క 'కాలా' స్క్రిప్ట్‌ నాది అంటూ ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం, ఈ చిత్ర నిర్మాత అయిన ధనుష్‌కీ, రజనీకాంత్‌కి నోటీసులు జారీ చేసింది. త్వరలోనే రజనీ కాంత్‌ 'రోబో 2.0' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది.

ALSO READ: చరణ్‌ - సుకుమార్‌ 'రంగస్థలం'