ENGLISH

రాక్షసుడు గా క‌నిపించేది ఎవ‌రు?

14 July 2021-16:03 PM

టాలీవుడ్ లో మ‌రో సీక్వెల్ సిద్ధం అవుతోంది. అదే... `రాక్ష‌సుడు 2`. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ - ర‌మేష్‌వ‌ర్మ కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా `రాక్ష‌సుడు`. ఇప్పుడు `రాక్ష‌సుడు 2`ని ప‌ట్టాలెక్కిస్తున్న‌ట్టు ర‌మేష్ వ‌ర్మ ప్ర‌క‌టించారు. కానీ హీరో ఎవ‌రన్న‌ది మాత్రం చెప్ప‌లేదు. ఈ సినిమాలో బెల్లంకొండ న‌టించ‌డ‌న్న విష‌యం సుస్ప‌ష్టం. మ‌రి ఆ స్థానంలో ఎవ‌రు న‌టిస్తార‌న్న‌ది ఆస‌క్తి నెల‌కుంది.

 

చిత్ర‌బృందం ఈసారి త‌మిళ హీరోని తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఆ హీరో విజ‌య్ సేతుప‌తి అయ్యే అవ‌కాశాలున్నాయట‌. ఇందుకోసం విజ‌య్ సేతుప‌తితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు టాక్‌. విజ‌య్ సేతుప‌తికి త‌మిళంలోనే కాదు, తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే విజ‌య్ ని ఖాయం చేసుకోబోతున్న‌ట్టు టాక్. త్వ‌ర‌లోనే విజ‌య్ ని క‌లిసి క‌థ చెప్ప‌బోతున్నాడ‌ట ర‌మేష్ వ‌ర్మ‌. విజ‌య్ గ‌నుక ఓకే అంటే.. వ‌చ్చే నెల‌లోనే షూటింగ్ ప్రారంభించ‌డానికి సైతం.. నిర్మాత‌లు రెడీగా ఉన్నారు.

ALSO READ: అట‌కెక్కిన అనుష్క సినిమా?