ENGLISH

కోర్టు మెట్లెక్కిన ర‌కుల్

17 September 2020-15:00 PM

ఈమ‌ధ్య మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టిన సెల‌బ్రెటీ పేరు... ర‌కుల్ ప్రీత్ సింగ్‌. సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య త‌ర‌వాత‌.. డ్ర‌గ్స్ రాకెట్ బ‌య‌ప‌డ‌డం, రియా చ‌క్ర‌వ‌ర్తి అరెస్ట్ కావ‌డం తెలిసిన విష‌యాలే. డ్ర‌గ్స్ రాకెట్ కి సంబంధించి రియా మ‌రో 24 మంది బాలీవుడ్ సెల‌బ్రెటీల పేర్లు బ‌య‌ట‌పెట్టిన‌ట్టు, అందులో ర‌కుల్ పేరు కూడా ఉంద‌ని ప్ర‌చారం సాగింది.

 

బాలీవుడ్ మీడియా ఈ విష‌యంపై విస్క్కృత‌మైన క‌థ‌నాల్ని ప్రచురించింది. ఛాన‌ళ్ల‌లోనూ ర‌కుల్ పేరు మార్మోగిపోయింది. ఈ నేప‌థ్యంలో ర‌కుల్ కూడా ట్రోలింగ్ కి గురైంది. అయితే ర‌కుల్ పేరు ఈ కేసులో లేద‌ని, అదంతా మీడియా క‌ట్టుక‌థ అని తేల‌డంతో.. ర‌కుల్ ఇప్పుడు మీడియా సంస్థ‌ల‌పై కేసు వేయ‌డానికి రెడీ అయ్యింది. త‌న పేరు ఈ కేసులో అన‌వ‌స‌రంగా ఇరికించార‌ని, త‌న‌పై క‌థ‌నాలు రాకుండా చూడాల‌ని డిల్లీ హైకోర్టుని ఆశ్ర‌యించింది ర‌కుల్. దీనిపై ర‌కుల్‌కి అండ‌గా నిల‌బ‌డింది హైకోర్టు. ర‌కుల్ వేసిన రిట్.. ని ఫిర్యాదుగా తీసుకోవాల‌ని ఆయా సంస్థ‌ల‌కు కోర్టు ఆదేశించింది. ఈమేర‌కు స‌మాచార ప్ర‌సార శాఖ‌, ప్ర‌సార భార‌తి, ప్రెస్ కౌన్సిల్‌ల‌కు నోటీసులు జారీ చేసింది.

ALSO READ: టాలీవుడ్‌పై అంత ‘శ్రద్ధ’ లేదంటోందట.