ENGLISH

టాలీవుడ్‌పై అంత ‘శ్రద్ధ’ లేదంటోందట.

17 September 2020-13:00 PM

‘సాహో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌, ఆ తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ‘ఇకపై తెలుగు సినిమాల్లోనూ నటిస్తూనే వుంటా..’ అని అప్పట్లో ‘సాహో’ సినిమా ప్రమోషన్‌ కోసం ఏవేవో కథలు చెప్పిందిగానీ, టాలీవుడ్‌ నుంచి ఎవరైనా తనను అప్రోచ్‌ అయితే, ‘డేట్స్‌ లేవు’ అని తెగేసి చెబుతోందట. ‘డేట్స్‌ లేకపోవడం కాదు, ఇంట్రెస్ట్‌ లేకపోవడం’ అని ఆమెతో టచ్‌లోకి వెళ్ళి నిరాశగా వెనుదిరుగుతోన్న టాలీవుడ్‌ నిర్మాతలు కొందరు ఆఫ్‌ ది రికార్డ్‌గా చెప్పుకుంటున్నారట.

 

శ్రద్ధా కపూర్‌ మాత్రం, తన పాత్ర నచ్చితే, మిగతా విషయాల గురించి ఆలోచించకుండా ఏ లాంగ్వేజ్‌లో అయినా సినిమాలు చేస్తానని చెబుతుండడం గమనార్హం. ఓ కన్నడ నిర్మాత కూడా ఓ ప్రతిష్టాత్మక సినిమా కోసం శ్రద్ధా కపూర్‌ని సంప్రదిస్తే, రెమ్యునరేషన్‌ దగ్గర డీల్‌ సెట్‌ కాలేదని అంటున్నారు. ఐదు కోట్ల పైనే ఆమె రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తుండడంతో సౌత్‌ నిర్మాతలు శ్రద్ధా కపూర్‌ పేరు చెబితేనే హడలిపోవాల్సి వస్తోంది. అయినా, సౌత్‌లో బోల్డంతమంది అందాల భామలుండగా శ్రద్ధాకపూర్‌ కోసం వెంపర్లాడటమేంటట.? అంటే, ‘పాన్‌ ఇండియా ఫీల్‌ కోసం’ అని సౌత్‌ నిర్మాతలు కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Shraddha Kapoor Latest Photoshoot