ENGLISH

సమంత, రకుల్‌.. మిథాలీ రాజ్‌గా ఎవరు?

28 September 2017-18:56 PM

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా చెలామణీ అవుతోన్న ముద్దుగుమ్మ సమంత. ఈ ముద్దుగుమ్మ చేతికి ఓ బిగ్‌ ప్రాజెక్ట్‌ చిక్కినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండియన్‌ మహిళా క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ జీవిత గాధ ఆధారంగా బాలీవుడ్‌లో సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే రీల్‌ లైఫ్‌ మిథాలీ రాజ్‌గా ఎవరు నటిస్తారన్న కోణంలో సమంత పేరు వినిపిస్తోంది. ఈ సినిమాని తెరకెక్కించేందుకు వయాకామ్‌ 18 సంస్థ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ సంస్థ సమంతతో సంప్రదింపులు జరుపుతోందనీ బాలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. సమంత ప్రస్తుతం చాలా బిజీ. తెలుగు, తమిళ భాషల్లో చేతినిండా సినిమాలతో పాటు, వచ్చే నెల 6వ తేదీన నాగచైతన్యతో వివాహం కూడా జరగనుంది సమంతకు. అయితే మరో పక్క ఈ క్యారెక్టర్‌కి ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అయితే బావుంటుందనీ ప్రచారం జరుగుతోంది. ఆమె ఫిజిక్‌, హైట్‌, పర్సనాలిటీ ఈ క్యారెక్టర్‌కు సూట్‌ అవుతుందని అంటున్నారు. అలాగే ఆమెకు ఫిట్‌నెస్‌తో పాటు క్రీడా రంగంలోనూ అనుభవం ఉంది. సో రకుల్‌ అయితే ఇంకా బాగుంటుందని భావిస్తున్నారు. అయితే ఇంకా ఈ క్యారెక్టర్‌కి ఎవరు కరెక్ట్‌ అనే విషయంలో ఇంకా అఫీషియల్‌ క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి మిథాలీ రాజ్‌ బయోపిక్‌పై టాలీవుడ్‌ ముద్దుగుమ్మల పేర్లు వినిపించడం ఆనందించదగ్గ విషయం.

ALSO READ: తల్లిగా రెజినా!