ENGLISH

సంక్రాంతి బుల్లోడు రామ్‌చరణ్‌

16 June 2018-17:15 PM

సంక్రాంతికి మెగా స్లాట్‌ బుక్‌ అయిపోయింది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సినిమా సంక్రాంతి రేస్‌లో నిలిచింది. బోయపాటి శీనుతో చరణ్‌ నటిస్తున్న సినిమా ఈ ఏడాది దసరాకి విడుదల చేయాలనుకున్నారు. కానీ సంక్రాంతికి వెళ్లిపోయింది. ఇప్పట్లో చిత్రీకరణ పూర్తయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో, సంక్రాంతికి స్లాట్‌ బుక్‌ చేసింది చిత్ర యూనిట్‌. 

ఇకపోతే సంక్రాంతికి మరే ఇతర పెద్ద సినిమాలూ లేకపోవడంతో ఇప్పటికిదే పెద్ద సినిమా అని చెప్పొచ్చు. అయితే ఈ ఏడాది మార్చిలో 'రంగస్థలం'తో వచ్చి దుమ్ము దులిపేసిన మొనగాడు రామ్‌చరణ్‌ ఈ ఏడాది చివర్లోనే మరో సినిమాతోనూ వచ్చి సత్తా చాటుతాడని అభిమానులు భావించారు. కానీ తాజా అనౌన్స్‌మెంట్‌తో ఈ ఏడాదికింక చరణ్‌ సినిమా లేదని, కూసింత డీలా పడ్డారు. 

మొదట్లో మెగాస్టార్‌ 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'ని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ 'సైరా' సమ్మర్‌ బరిలో చేరడంతో, సంక్రాంతి స్లాట్‌లోకి తాజాగా చెర్రీ వచ్చి చేరాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చరణ్‌కి జోడీగా 'భరత్‌' బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. మరోవైెపు చరణ్‌ - ఎన్టీఆర్‌తో మల్టీ స్టారర్‌లో నటించాల్సి ఉంది. జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 

ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తున్న 'అరవింద సమేత' చిత్రం దసరా బరిలో నిలిచింది. ఎన్టీఆర్‌ ఈ సినిమా పూర్తి చేసుకోగానే జక్కన్న మల్టీ స్టారర్‌ పట్టాలెక్కనుందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌.

ALSO READ: నా నువ్వే మొదటి రోజు కలెక్షన్లు తెలిస్తే షాక్ అవుతారు