ఓటీటీ ఇప్పుడు సినిమాకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఇది వరకు పట్టణ ప్రేక్షకులకే పరిమితమైన అమేజాన్, నెట్ ఫ్లిక్స్‌లు ఇప్పుడు బీ, సీ సెంటర్లకూ వెళ్లిపోయాయి. అందరూ అంతర్జాతీయ వెబ్ సిరీస్‌ల గురించి మాట్లాడుకుంటున్నారు. దాంతో.. మన స్టార్ హీరోలకూ అటు వైపు దృష్టి పెట్టక తప్పడం లేదు. వెంకటేష్ ఇప్పటికే ఓ వెబ్ సిరీస్‌లో నటించడానికి రెడీ అయిపోయారు. నాగ చైతన్యతో కూడా ఓ వెబ్ సిరీస్ ప్లానింగ్ లో ఉంది. సమంత ఇప్పటికే అందులోకి వెళ్లిపోయింది. కాజల్, శ్రుతిహాసన్‌లూ ఆ రుచి మరిగారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అటువైపుగా ఓ లుక్ వేయడానికి రెడీ అయిపోయినట్టు టాక్.
రామ్ చరణ్‌తో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓ వెబ్ సిరీస్ రూపొందించడానికి సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఓ ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ని ఇండియన్ లాంగ్వేజెస్‌లో రిమేక్ చేసే సన్నాహాల్లో ఉంది నెట్ ఫ్లిక్స్. అందుకోసం ఓ స్టార్ హీరో కావాలి. వాళ్ల దృష్టి రామ్ చరణ్‌పై పడింది. ఈ మేరకు రామ్ చరణ్‌తో నెట్ ఫ్లిక్స్ సంప్రదింపులు మొదలెట్టిందని తెలుస్తోంది. ఇటీవల రామ్ చరణ్ ముంబై వెళ్లారు. అక్కడ నెట్ ఫ్లిక్స్ ప్రతినిథులతో భేటీ వేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే ఛాన్సుంది.
ALSO READ: మహేష్‌పై బాలీవుడ్ కి నమ్మకం లేదా?