ENGLISH

చరణ్ పారితోషికం పెంచేశాడా?

26 April 2024-12:34 PM

మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆనతి కాలంలోనే తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు పొంది , గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. RRR సినిమాతో భారీ హిట్ కొట్టిన చరణ్ నెక్స్ట్ శంకర్ తో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది చివరికి  రిలీజ్  చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ మధ్యే చరణ్ చెన్నై కి చెందిన  వేల్స్ యూనివర్సిటీ నుంచి , డాక్టరేట్ అందుకున్నాడు. సినీ రంగంలో చరణ్ చేసిన విశేష కృషికి గుర్తుగా ఈ డాక్టరేట్ వచ్చింది. గేమ్  చేంజర్ మూవీ తర్వాత చరణ్ బుచ్చి బాబుతో ఒక మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజ కార్య క్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి ప్రజంట్ వైరలవుతోంది. 


తనకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని రామ్ చరణ్ భారీగా రెమ్యునరేషన్ పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు చెర్రీ పారితోషికం 95 నుంచి 100 కోట్ల వరకు ఉండగా, RC 16 కోసం ఏకంగా 30 కోట్లు పెంచినట్టు టాక్. మైత్రి మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో చరణ్ కి ఉన్న మార్కెట్ దృష్టిలో పెట్టుకుని వారు అంత ఇవ్వటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అంటే  బుచ్చి బాబుతో చేయబోయే సినిమాకి చెర్రీ 130  కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. 


టాలీవుడ్ లో ఇప్పటివరకు ప్రభాస్ హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు చెర్రీ సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. గేమ్ చేంజెర్ , RC 16 హిట్ అయితే మార్కెట్ ప్రకారం  చెర్రీ ప్రభాస్ ని క్రాస్ చేయొచ్చని ట్రేడ్ పండితుల సూచన.  ఇప్పటికే చరణ్ నటించిన గేమ్ చేంజెర్ కేవలం  హిందీ థియేట్రికల్ రైట్స్ 75  కోట్లకి అమ్ముడైన సంగతి  తెలిసిందే. ఈ మార్కెట్ వాల్యూ కేవలం చెర్రీ వలనే  అని తెలుస్తోంది.