ENGLISH

'హలో గురూ..' ఈ సారి ఎనర్జీ పక్కా గురూ!

12 March 2018-15:01 PM

రామ్‌ అంటే ఎనర్జీ. కానీ ఆ ఎనర్జీ బాగా తగ్గిపోయింది 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలో. దాంతో ఆ సినిమా సక్సెస్‌ని కూడా తప్పించుకుని పక్కకి వెళ్లిపోయింది. సక్సెస్‌ ఫార్ములాతో, సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌గా రామ్‌ - కిషోర్‌ తిరమల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆ సినిమాలో రామ్‌ ఎనర్జిటిక్‌ కనిపించలేదంటూ కామెంట్స్‌ వచ్చాయి. న్యూ గెటప్‌ ట్రై చేశాడు రామ్‌ ఆ సినిమా కోసం. కానీ ఆ గెటప్‌ కూడా ఫెయిలైంది. 


దాంతో ఈ సారి రామ్‌ ఇదివరకటి ఎనర్జీతో పక్కా ప్లానింగ్‌తో దూసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. 'హలో గురూ ప్రేమ కోసమే..' సినిమాలో రామ్‌ నటిస్తున్నాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. ప్రయోగాలేమీ లేకుండా, సింపుల్‌ స్టోరీని రామ్‌ అభిమానులు మెచ్చే విధంగా డైరెక్టర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట. ముందుగా రామ్‌ నుండి అభిమానులు కోరుకునేది ఎనర్జీ. ఆ ఎనర్జీతోనే ఈ సినిమా విజయానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నాడట రామ్‌. 'నేను శైలజ' సినిమా రామ్‌ కెరీర్‌లో బెస్ట్‌ ఫలితాన్నిచ్చింది. ఆ తర్వాత ఆ రేంజ్‌లో హిట్‌ రాలేదు రామ్‌కి. ఆ స్థాయి హిట్‌ ఇదే అవుతుందని అంటున్నారు. 

నాగార్జున హిట్‌ మూవీ 'నిర్ణయం' లోని సూపర్‌ హిట్‌ సాంగ్‌లోని లైన్‌ 'హలో గురూ ప్రేమ కోసమే..' అంటూ ఈ సినిమాకి టైటిల్‌ ఫిక్స్‌ చేసినప్పుడే సగం సక్సెస్‌ అయింది చిత్ర యూనిట్‌. చూడాలి మరి ఆ పేరును సార్ధకం చేసేలా సినిమా ఉంటుందో లేదో. ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ రామ్‌తో రెండో సారి జత కడుతోంది చిత్రం ద్వారా.

ALSO READ: ప్రభాస్ కోసం రాజమౌళి 'సాహో' స్కెచింగ్‌