ENGLISH

దర్శకేంద్రుడితో వెంకటేష్‌?

12 March 2018-14:56 PM

వెంకటేష్‌ జోరు పెంచారు. 'గురు' తర్వాత వెంకీ గ్యాప్‌ తీసుకున్నారు. ఇప్పుడు వెంకీ సూపర్‌ స్పీడు పెంచినట్లు తెలుస్తోంది. వెంకటేష్‌ చుట్టూ చాలా కథలు తిరుగుతున్నాయి. మల్టీ స్టారర్స్‌ అనీ, కామెడీ ఎంటర్‌టైనర్స్‌ అనీ..ఇలా. పలు స్టోరీలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో మల్టీ స్టారర్‌గా అబ్బాయ్‌ రానాతో కలిసి వెంకీ నటిస్తున్నాడు. అది కరెక్టే. మరో పక్క వెంకీ - తేజ కాంబినేషన్‌లో ఫ్యామిలీ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కూడా పక్కానే. ఈ సినిమాకి 'ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. 

ఇకపోతే తాజాగా లైన్‌లోకి వచ్చింది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో వెంకీ ఓ సినిమా చేయబోతున్నారట. అదీ ఆధ్యాత్మిక చిత్రమట. అయితే ఆల్రెడీ ఆధ్యాత్మిక చిత్రాల కాంబినేషన్‌ అయిన నాగార్జున - రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఓ ఆధ్యాత్మిక చిత్రం రానుందన్న ప్రచారం ఈ మధ్య బాగా వినిపిస్తోంది. ఆ సినిమానే దర్శకేంద్రుడు వెంకీతో తీయబోతున్నారా? లేక నాగార్జున నటిస్తున్న ఆ సినిమాలో వెంకీ కీలక పాత్ర పోషిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. 

మొత్తానికి వెంకీ - దర్శకేంద్రుడి కాంబినేషన్‌లో సినిమా అయితే రానుందని ఫిల్మ్‌ నగర్‌ వర్గాల సమాచారమ్‌. ఇదిలా ఉండగా, వెంకీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, సునీల్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నాడట. అయితే అది కమెడియన్‌ పాత్రనా? లేక మరే ఇతర ఇంపార్టెంట్‌ రోలా? అనేది క్లారిటీ లేదు. 

కానీ గతంలో సునీల్‌ కమెడియన్‌గా ఉన్నప్పుడు వెంకీతో పలు చిత్రాల్లో నటించాడు. ఈ ఇద్దరి మధ్యా కామెడీ ట్రాక్‌ చాలా బాగా పండుతుంది. ఇవే కాక సునీల్‌ హీరోగా డైవర్ట్‌ అయ్యాక కమెడియన్‌గా కనిపించలేదు. ఈ మధ్యనే మళ్లీ ట్రాక్‌ మార్చి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు.

ALSO READ: శ్రీదేవి కోసం చెన్నైలో...