ENGLISH

Ramya Krishna: శివ‌గామి - బ్యాక్ ఎగైన్‌!

25 July 2022-10:31 AM

ర‌మ్య‌కృష్ణ జీవితంలో `న‌ర‌సింహా` త‌ర‌వాత‌... `బాహుబ‌లి` ఓ మైల్ స్టోన్‌. అందులో శివ‌గామిగా అద్భుత‌మైన న‌ట‌న ప్ర‌ద‌ర్శించింది. అయితే `బాహుబ‌లి` త‌ర‌వాత ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు అంత పేరు తీసుకురాలేక‌పోయాయి. మ‌రీ రొటీన్ పాత్ర‌లే వ‌చ్చి ప‌డ‌డంతో ర‌మ్య త‌న ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. `బాహుబ‌లి` ఇచ్చిన మైలేజీకి, క్రేజ్‌నీ ర‌మ్య స‌రిగా వాడుకోలేదు కూడా. అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ ర‌మ్య‌.. ఈజ్ బ్యాక్ అనిపిస్తోంది. రెండు వ‌రుస సినిమాల్లో... రెండు అద్భుత‌మైన పాత్ర‌లు ఆమె వ‌శ‌మ‌య్యాయి.

 

లైగ‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు త‌ల్లిగా ర‌మ్య‌కృష్ణ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ట్రైల‌ర్‌లో ర‌మ్య విశ్వ‌రూపం చూసేశారు. పూరి జ‌గ‌న్నాథ్ సినిమాల్లో హీరోకుండే పొగ‌రు. ... ర‌మ్య పాత్ర‌లో క‌నిపిస్తోంది. ఈసినిమాతో ర‌మ్య డామినేష‌న్ చూడ‌డం ఖాయం అనిపిస్తోంది. మ‌రోవైపు... `రంగ‌మార్తండ‌`లో ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క‌మైన పాత్ర చేసింది. అందులోనూ... త‌న అద్వితీయ‌మైన న‌ట‌న ప్ర‌ద‌ర్శించింద‌ని టాక్. పెళ్ల‌య్యాక‌.. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డం ర‌మ్య‌కు ఇదే తొలిసారి. అందుకే.. ఈ పాత్ర‌పై అటు కృష్ణ‌వంశీ, ఇటు ర‌మ్య‌కృష్ణ ఇద్ద‌రూ మ‌న‌సు పెట్టార్ట‌.

 

`రంగ‌మార్తండ‌`లోనూ... ర‌మ్య పాత్ర అదిరిపోతుంద‌ని, ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి శివ‌గామి ఈజ్ బ్యాక్ అనుకోవాలి.

ALSO READ: ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సిరిస్ రివ్యూ