ENGLISH

Thank You, Maharshi: థ్యాంక్యూ.. మ‌హర్షి.. రెండూ ఒక‌టేనా?

25 July 2022-11:33 AM

నాగ‌చైత‌న్య సినిమా `థ్యాంక్యూ` ఈ శుక్ర‌వార‌మే విడుద‌లైంది. తొలి రోజే డిజాస్ట‌ర్ టాక్ మూట‌గ‌ట్టుకొంది. ఈ వీకెండ్ మొత్తం క‌లిపి క‌నీసం రూ.3 కోట్లు కూడా రాలేదు. ఓవ‌ర్సీస్‌లో కూడా అంతే. ఈ క‌థ‌ని దిల్ రాజు ఎలా ఓకే చేశాడా? అంటూ.. ఇప్పుడు అంద‌రూ షాక్ అవుతున్నారు. `థ్యాంక్యూ` ట్రైల‌ర్లు చూసి `ఇది ఆటోగ్రాఫ్‌లా ఉంది.. ఇది 96 సినిమాలా ఉంది` అనుకున్నారంతా. నిజానికి `థ్యాంక్యూ`కి మ‌హ‌ర్షి సినిమాతో లింకు ఉంది.

 

మ‌హ‌ర్షి సినిమా గుర్తుంది క‌దా? జీవితంలో ఉన్న‌త స్థాయికి చేరుకొన్న ఓ వ్య‌క్తి.. త‌న‌కు సాయం చేసిన స్నేహితుడ్ని వెదుక్కొంటూ ఇండియా వ‌స్తాడు. అక్క‌డ త‌న స్నేహితుడి స‌మ‌స్య‌ని త‌న భుజాల‌పై వేసుకొని ప‌రిష్క‌రిస్తాడు. ఇదే క‌థ‌. థ్యాంక్యూ కూడా అంతే. కాక‌పోతే.. రైతుల స‌మ‌స్య ఉండ‌దు. అంతే తేడా.

 

మ‌హ‌ర్షి క‌థ రాసుకొన్న‌ప్పుడు కూడా అందులో రైతుల స‌మ‌స్య లేద‌ట‌. ఆ త‌ర‌వాతే దాన్ని జోడించారు. అంటే... మ‌హ‌ర్షికి మ‌రో వెర్ష‌న్‌... థ్యాంక్యూ అన్న‌మాట‌. మ‌హ‌ర్షి సినిమాలోనూ దిల్ రాజు వాటా దారుడే. అలాంట‌ప్పుడు ఈ రెండు క‌థ‌లూ ఒక‌టే అనే విష‌యం దిల్ రాజు ఎలా గ్ర‌హించ‌లేక‌పోయాడో?

ALSO READ: ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సిరిస్ రివ్యూ