ENGLISH

పారితోషికం కోసం బెట్టు చేస్తున్నాడా?

12 November 2020-13:00 PM

మ‌ల‌యాళ చిత్రం `అప్ప‌య్య‌యుమ్ కోషియ‌మ్‌`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడు. `పింక్‌` రీమేక్ అవ్వ‌గానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి. అయితే.. ఇంత వ‌ర‌కూ మ‌రో హీరో ఎవ‌ర‌న్న‌ది తేల‌లేదు. ఆ ఛాన్స్ రానాకే ఎక్కువ‌గా ఉంది. రానాకీ ఈ రీమేక్‌లో న‌టించ‌డం ఇష్ట‌మే. అయితే.. `చేస్తా` అనో, `చేయ‌ను` అనో తేల్చి చెప్ప‌డం లేదు. దానికి కార‌ణం.. పారితోషిక‌మే అని టాక్‌. ఈ సినిమా కోసం రానా ఊహించ‌నంత పారితోషికం డిమాండ్ చేశాడ‌న్న టాక్ వినిపిస్తోంది.

 

పారితోషికం వ‌దులుకోవ‌డానికి తాను సిద్ధ‌మే అని, అయితే.. సురేష్‌ప్రొడ‌క్ష‌న్స్‌కీ ఈ సినిమాలో వాటా ఇవ్వాల‌ని అడుగుతున్నాడ‌ట‌. అయితే.. ఈ విష‌యంలోనే నిర్మాత‌లు ఏం తేల్చుకోలేక‌పోతున్నార‌ని స‌మాచారం. ప‌వ‌న్ కి ఈసినిమా కోసం ఏకంగా 50 కోట్లు ఇస్తున్నార్ట‌. మిగిలిన పారితోషికాలు త‌గ్గించుకుని సినిమాని వీలైనంత త‌క్కువ‌లో పూర్తి చేయాల‌ని నిర్మాత‌లు అనుకుంటున్న త‌రుణంలో.. రానా భారీ పారితోషికం అడ‌గ‌డంతో షాక్‌కి గుర‌య్యారు. పారితోషికం విష‌యంలో అటు రానా, ఇటు నిర్మాత‌లూ ఓ అవ‌గాహ‌న‌కు వ‌స్తే గానీ, ఈ మేట‌ర్ తేలేట్టు క‌నిపించ‌డం లేదు.

ALSO READ: 15 ఏళ్ల‌కు రీమేక్ చేస్తున్నారా?