ENGLISH

బుల్లితెరపై భళ్ళాలదేవుడు

01 June 2017-15:38 PM

వెండితెర నటులు బుల్లితెరపై కనిపించడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. డిఫరెంట్‌ డిఫరెంట్‌ రియాల్టీ షోస్‌తో అలరిస్తున్నారు. టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జునతో స్టార్ట్‌ అయిన బుల్లితెర గేమ్‌ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాం ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి చేసే వరకూ వచ్చింది. ఏకంగా మెగాస్టార్‌ అంతటి హీరోనే తన స్టార్‌డమ్‌ని పక్కన పెట్టేసి బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించడానికి కంకణం కట్టుకున్నారు. దాంతో ఆయన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని చాలా మంది యంగ్‌ స్టార్స్‌ కూడా బుల్లితెర ప్రోగ్రాంస్‌కి హోస్ట్‌గా వ్యవహరించడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా బుల్లితెరపై ఓ రియాల్టీ షో రానుందని ప్రచారం జరుగుతోంది. అలాగే అదే కోవలోకి ఇప్పుడు తాజాగా భళ్లాలదేవ రానా కూడా వచ్చి చేరాడు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనుభవం రానాకి బాగానే ఉంది. పలు ఆడియో ఫంక్షన్స్‌లోనూ, ఆవార్డు ఫంక్షన్స్‌లోనూ రానా మైక్‌ పట్టుకుని తన యాంకరింగ్‌తో ఆకట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. సో అనుభవంతో రానా బుల్లితెర ప్రేక్షకుల్ని బాగానే ఎట్రాక్ట్‌ చేయగలడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు కాబోలు. సెలబ్రిటీస్‌తో టాక్‌ షో అనే ఓ కార్యక్రమానికి రానా శ్రీకారం చుట్టబోతున్నాడట. ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాలు చాలానే ఉన్నప్పటికీ, ఇదో డిఫరెంట్‌ ప్రోగ్రాం. చాలా హైఫై రేంజ్‌లో ఉండబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రానా విలక్షణ నటుడిగా వెండితెరపైనే కాదు, బుల్లితెర పైనా సత్తా చాటాలనుకుంటున్నాడన్న మాట.