ENGLISH

మా మధ్య ఏమిలేదు: రణబీర్-మహీరా

23 September 2017-14:53 PM

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పైన లింకప్ రూమర్స్ రావడం చాలా సాధారణ విషయం అలాగే ఈ మధ్యకాలంలో ఆయన ఎవరితోనూ ప్రేమలో లేకపోవడంతో ఆయన పైన ఈ రూమర్స్ ఎక్కువగా వస్తున్నాయి.

అయితే ఈయన పాకిస్తానీ నటి అయిన మహీరా ఖాన్ ప్రేమలో ఉన్నట్టు ఇద్దరు కలిసి అమెరికాలో హాలిడే కి వెళ్ళినట్టు కొత్తగా వార్తలు రావడం మొదలయింది. దీనికి తోడుగా ఇద్దరు పోగత్రాగుతూ ఉన్న ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.

ఇక దీని పై స్పందించిన నటి మహీరా – తమ మధ్య ఎటువంటి బంధం లేదు అని స్పష్టం చేసింది. ఇక ఇదే విషయమై రణబీర్ కపూర్ తండ్రి అయిన రిషీ కపూర్ కూడా ఇద్దరు పోగత్రాగుతూ కనపడితే ఏవేవో ఉన్నట్టు రాయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.

రణబీర్ కపూర్ మాత్రం ఇంకా ఎటువంటి కామెంట్ చేయలేదు.

 

ALSO READ: ఇండియన్ ఆస్కార్ ఎంట్రీ న్యూటన్ మూవీ రివ్యూ & రేటింగ్స్