ENGLISH

'రంగస్థలం' సినిమాకి అసలు ప్రేరణ అదేనట.!

16 March 2018-12:04 PM

ఓవర్సీస్‌లో సుకుమార్‌ సినిమాలకు చాలా పాపులారిటీ ఉంది. క్లాస్‌నీ, మాస్‌నీ కూడా ఏకకాలంలో మెప్పించగల టాలెంట్‌ ఉన్న డైరెక్టర్‌ సుకుమార్‌. అందుకే ఆయన సినిమాలు ఓవర్సీస్‌లో కూడా బాగా కలెక్షన్స్‌ రాబడతాయి. తాజా చిత్రం 'రంగస్థలం' సంగతేంటని అడిగితే, ఈ సినిమా పూర్తిగా 1980ల నాటి నేపథ్యంలో అచ్చమైన పల్లెటూరి ఫ్లేవర్‌ మాత్రమే కనిపించేలా ఉండబోతోంది. మరి ఈ సినిమా విషయంలో ఓవర్సీస్‌ మార్కెట్‌ సంగతేంటని అడిగితే, సుకుమార్‌ ఒక్కటే చెప్పాడు.

చాలా మందికి లైఫ్‌లో 1980ల కాలం తాలూకు జ్ఞాపకాలుంటాయి. ఒకవేళ ఆ కాలం గురించి, ఆ కాలం నాటి మన సంస్కృతీ, సాంప్రదాయాల గురించి తెలియకపోతే, తెలుసుకోవాలనే కోరిక ఈ సినిమా ద్వారా తీరిపోతుందనీ సుకుమార్‌ అన్నారు. అంతేకాదు, నిజానికి 'రంగస్థలం' వంటి స్క్రిప్టు ప్రిపేర్‌ చేయడానికి కారణమే అక్కడి ఎన్నారై సోదరులు అని సుకుమార్‌ తెలపడం విశేషం. ఇకపోతే, ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతోంది. దాంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు వేగవంతమయ్యాయి.

అందులో భాగంగా సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని విశాఖలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది చిత్రయూనిట్‌. ఈ ఆదివారం ఆహ్లాదమైన విశాఖ ఆర్‌.కె.బీచ్‌ తీరంలో హాయైన 'రంగస్థలం' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయగా, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కూడా హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: 'రంగస్థలం'కి షాకిచ్చిన గొల్లభామ!