ENGLISH

Rashmika: శేఖర్ క‌మ్ముల సినిమాలో ర‌ష్మిక‌?

17 October 2022-14:34 PM

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వ‌స్తే క‌థానాయిక‌లంతా ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే... ఆయ‌న సినిమాల్లో హీరో కంటే హీరోయిన్ కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. క‌మ‌లిని ముఖ‌ర్జీ ద‌గ్గ‌ర్నుంచి, సాయి ప‌ల్ల‌వి వ‌ర‌కూ త‌న క‌థానాయిక‌ల్ని ఓ రేంజ్ లో చూపిస్తుంటారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఇప్పుడు ఆ ఛాన్స్‌... ర‌ష్మిక‌కు ద‌క్కిందని స‌మాచారం.

 

శేఖర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇందులో క‌థానాయిక‌గా ర‌ష్మిక‌ని ఎంచుకొన్న‌ట్టు తెలుస్తోంది. విద్యావ్య‌వ‌స్థ నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంద‌ని, పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. అందుకే `పుష్ప‌`తో పాన్ ఇండియా వ్యాప్తిగా గుర్తింపు పొందిన ర‌ష్మిక‌ని క‌థానాయిక‌గా తీసుకొన్నార్ట‌. ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల స్క్రిప్టు ప‌నుల్లో బిజీగా ఉన్నారు. 2023 జ‌న‌వ‌రిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది. ధ‌నుష్ తో ర‌ష్మిక జ‌త క‌ట్ట‌డం ఇదే తొలి సారి.

ALSO READ: కాంతార‌... క‌ల‌క్ష‌న్ల వాన‌!