ENGLISH

Hunt: వివాదంలో సుధీర్ బాబు 'హంట్'

18 October 2022-11:42 AM

సుధీర్‌బాబు హీరోగా దర్శకుడు మహేశ్‌ తెరకెక్కిస్తు యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హంట్‌’. భవ్య క్రియేషన్స్ వి. ఆనంద ప్రసాద్‌ నిర్మాత. ఇప్పటికే టీజర్ ని వదిలారు. అయితే ఇప్పుడీ సినిమా వివాదంలో పడింది. హంట్ టైటిల్‌ తనదేనంటూ యువ దర్శకుడు నిక్షిత్‌ ఆరోపించాడు. ఎం. ఎస్‌ ఆర్ట్స్‌, శ్రీ క్రియేషన్స్‌ బ్యానర్స్ పై మూడు నెలల క్రితం ఆ పేరును రిజిస్ట్రేషన్‌ చేయించామని, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆ టైటిల్‌పై హక్కులు తమకే ఇచ్చిందని చెబుతున్నాడు.

 

సుధీర్‌బాబు హీరోగా భవ్య క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న సినిమాకు అదే టైటిల్ పెట్టి టీజర్ విడుదల చేశారని, ఈ విషయంపై ఫిల్మ్ చాంబర్ కు ఫిర్యాదు చేశామని, ఛాంబర్ సూచనలు కూడా సుధీర్ బాబు యూనిట్ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ వివాదం వల్ల తన చిత్రానికి ఆర్థికంగా నష్టం చేకూరుతుందని, సుధీర్‌బాబు సినిమా టైటిల్ మార్చుకునేలా ఛాంబర్ పెద్దలు జోక్యం చేసుకోవాలని నిక్షిత్ కోరాడు.

 

సుధీర్ బాబు హంట్ యూనిట్ మాత్రం సినిమా మొదలుపెట్టినపుడే ఈ టైటిల్ అనుకున్నామని, ముందు తమ టైటిలే రిజిస్టరైనట్లు చెబుతున్నట్లు తెలిసింది. ఆల్రెడీ అదే పేరుతో టీజర్ కూడా విడుదల చేయడంతో ఇప్పుడు పేరు మార్చుకునే అలోచన సుధీర్ యూనిట్ లో లేనట్లే కనిపిస్తోంది.

ALSO READ: ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్.. అన్ స్టాప‌బుల్‌!