ENGLISH

Sudhakar Cherukuri: ఫ్లాఫ్ సెంటిమెంట్ ని లెక్క చేయని నిర్మాత

18 October 2022-12:30 PM

ఇప్పటివరకు రాజీపడని సినిమాలే తీశారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. పడిపడి లేచే మనసు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ.. ఈ సినిమాలన్నీ నిర్మాణం పరంగా ఉన్నతంగానే వుంటాయి. అయితే సరైన విజయం మాత్రం ఇప్పటివరకు రాలేదు. విరాటపర్వానికి మంచి సినిమా అనే పేరు వచ్చింది కానీ మంచి కమర్షియల్ విజయం మాత్రం అందలేదు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా నానితో 'దసరా' చేస్తున్నారు. నాని మాస్ అవతార్ లో కనిపిస్తున్న చిత్రమిది. ప్రమోషన్స్ మెటిరియల్ లో ఎక్కడ చూసి మాసీగానే వుంది.

 

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ ని వెన్నెల గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ వదిలారు. ఆమె కూడా డస్కీ లుక్ లో మాసీగానే వుంది. ఇందులో ఆమె పాత్ర పేరు వెన్నెల. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఇదివరకే ఒక వెన్నెలని చూపించారు. విరాటపర్వంలో సాయి పల్లవి పేరు వెన్నెలే. ఆ సినిమా ఫలితం ఏమిటో అందరికీ తెలుసు. బేసిగ్గా సినిమా రూపకర్తలకు ఇలాంటి ఫ్లాపు సెంటిమెంట్లు విషయంలో ఒక భయం వుంటుంది.

 

అయితే సుధాకర్ చెరుకూరి మాత్రం అలాంటి సెంటిమెంట్లు లెక్క చేయకుండా దసరాలో కూడా ఒక వెన్నెలని చూపించడానికి రెడీ అయ్యారు. 2023 మార్చ్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ALSO READ: ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్.. అన్ స్టాప‌బుల్‌!