ENGLISH

Pawan Kalyan; చెప్పు తీసుకుని కొడతా నా కొడకల్లారా: పవన్ కళ్యాణ్

18 October 2022-14:30 PM

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైసిపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనని ప్యాకేజీ స్టార్ అనడం తీవ్రంగా మండిపడ్డారు. ఇకపై తనను ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించి హెచ్చరించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

 

‘‘ఇంకోసారి ప్యాకేజీ అంటే మర్యాదగా ఉండదు.. చెప్పు తీసుకుని కొడతా. వైసీపీ గూండాల్లారా.. ఒంటి చేత్తో మెడ పిసికేస్తా. నేను అందరినీ గౌరవిస్తా.. కానీ అవతలి వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నా సహనం ఇన్నాళ్ళు మిమ్మల్ని రక్షించింది. ఇకపై పిచ్చి కూతలు కూస్తే చెప్పుతో కొడతానంటూ'' హెచ్చరించారు పవన్ కళ్యాణ్.

ALSO READ: ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్.. అన్ స్టాప‌బుల్‌!