టాలీవుడ్ హాట్ సెన్సేషన్ రష్మికా మండన్నా తమిళంలో కార్తి సినిమాతో అక్కడి ప్రేక్షకుల్ని పలకరిస్తున్న సంగతి తెలిసిందే. కార్తి నటిస్తున్న 'సుల్తాన్' సినిమా ద్వారా తమిళంలోకి అడుగు పెడుతున్న రష్మిక మరో బంపర్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. కార్తి అన్న, వన్ ఆఫ్ ది స్టార్ హీరో అయిన సూర్య సరసన నటించే అవకాశం దక్కించుకుందంటూ కోలీవుడ్ వర్గాల సమాచారం. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో 'మాస్టర్' ఫేమ్ మాళవిక నటిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి.
కానీ, ఆ ప్లేస్‌లోకి రష్మికను తీసుకురావాలంటూ తెర వెనక మంతనాలు జరుగుతున్నాయట. ఆ దిశగా రష్మికతో ఆల్రెడీ సంప్రదింపులు కూడా చేశారట. రష్మిక కూడా తమిళ ఇండస్ట్రీలో పాతుకుపోవాలని ఎప్పటి నుండో చూస్తోంది. నిజానికి స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ సినిమాలోనే రష్మిక ఛాన్స్ కోసం ఎదురు చూస్తోంది. ఆ దిశగా బోలెడంత పబ్లిసిటీ కూడా జరిగింది. అయితే, ఇంకా అందుకు సమయం రాలేదనుకోండి. అయితే, ఆ తరుణం ఇక త్వరలోనే రానుందనిపిస్తోంది. సూర్యతో ఛాన్స్ నిజమే అయితే, ఆ తర్వాత రష్మిక తాను కోరుకున్నట్లు తమిళంలో బిజీ అయిపోవడం ఖాయం.
తెలుగు విషయానికి వస్తే, 'సరిలేరు..'తో సూపర్ హిట్ కొట్టి, 'భీష్మ'తో అందాల విందు చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన 'భీష్మ' పోస్టర్లు, ప్రోమోలు రష్మికపై ఉన్న క్రేజ్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లిపోయాయి. తర్వాత అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాతో రష్మిక స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకోవడానికి కేవలం కొన్ని స్టెప్స్ మాత్రమే దూరంలో ఉందని చెప్పొచ్చునేమో.
ALSO READ: Rashmika Latest Photoshoot