ENGLISH

బ‌న్నీ బాట‌లో ర‌ష్మిక‌.

05 June 2020-11:00 AM

క‌థానాయిక‌ల టాలెంట్ పూర్తి స్థాయిలో బ‌య‌ట‌ప‌డాలంటే... దానికి త‌గ్గ పాత్ర‌లు దొర‌కాలి. అలాంటి పాత్ర‌లు సృష్టించ‌డంలో దిట్ట సుకుమార్‌. రంగ‌స్థ‌లంలో చ‌ర‌ణ్ కి ఎంత పేరొచ్చిందో, స‌మంత‌కీ అంతే పేరొచ్చింది. రామ‌ల‌క్ష్మిగా స‌మంత క‌ట్టూ, బొట్టూ, మాట‌తీరు... ఆక‌ట్టుకున్నాయి. డీ గ్లామ‌ర్ పాత్ర‌లోనూ అందంగా కనిపించింది. ఇప్పుడు 'పుష్ష‌'లో హీరోయిన్‌పాత్ర‌నీ అంతే శ్ర‌ద్ధ‌గా తీర్చిదిద్దాడ‌ట సుకుమార్‌. అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్ర‌మిది. రష్మిక నాయిక‌. ఇందులో బ‌న్నీతో పాటు ర‌ష్మిక పాత్ర కూడా రాయ‌ల‌సీమ యాస‌లోనే మాట్లాడ‌తాయి. ఇందుకోసం ఇప్ప‌టికే బ‌న్నీ రాయ‌ల‌సీమ యాస నేర్చుకోవ‌డం మొద‌లెట్టాడు.

 

రష్మిక కూడా ఇప్పుడు అదే చేస్తోంది. ట్యూట‌ర్ స‌హాయంతో.. రాయ‌ల‌సీమ యాస నేర్చుకుంటుంది. పాన్ ఇండియా సినిమా ఇది. అన్ని భాష‌ల్లోనూ త‌న గొంతే వినిపించాల‌నుకుంటుంది ర‌ష్మిక‌. అందుకే ఈ క‌స‌ర‌త్తంతా. షూటింగ్ మొద‌లెట్టే లోగా.. రాయ‌ల‌సీమ మాండ‌లికంపై ప‌ట్టు సాధించాల‌ని భావిస్తోంది. సో... రామ‌ల‌క్ష్మి పాత్ర‌లానే ర‌ష్మిక పాత్ర కూడా అదిరిపోవ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌.

ALSO READ: Rashmika Mandanna Hot Photoshoot