ENGLISH

రామారావు ప‌క్క‌న వాళ్లిద్ద‌రూ..!

19 July 2021-13:04 PM

ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `రామారావు` ఆన్ డ్యూటీ అనేది ఉప‌శీర్షిక‌. శ‌ర‌త్ మాండ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటీవ‌లే ఈ చిత్రం ప‌ట్టాలెక్కింది. ఇందులో క‌థానాయిక‌గా దివ్యాంక్ష కౌశిక్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో క‌థానాయిక కూడా ఎంట్రీ ఇచ్చింది. త‌నే...ర‌జిషా విజ‌య‌న్‌. ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌కి తెలుగులో ఇదే తొలి చిత్రం. ఇటీవ‌లే.... ర‌జిషా సెట్లోకి అడుగుపెట్టింది. ప్ర‌స్తుతం ర‌వితేజ - దివ్యాంక్ష - ర‌జిషా ల‌పై కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు.

 

ఓ ప్ర‌భుత్వాధికారి క‌థ ఇది. అవినీతి, లంచ‌గొండిత‌నం నేప‌థ్యంలో సాగే క‌థ అని తెలుస్తోంది. ప్ర‌భుత్వాధికారిగా.. ర‌వితేజ పాత్ర కొత్త త‌ర‌హాలో ఉంటుంద‌ని, ఆయ‌న పాత్ర చుట్టూ వినోదంతో పాటు, స‌మాజానికి ప‌నికొచ్చే సందేశం కూడా ఉంటుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. నాజ‌ర్‌, ప‌విత్రా లోకేష్‌, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సి.ఎస్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు.

ALSO READ: అటు పూజా.. ఇటు కియారా.. మ‌ధ్య‌లో ఎన్టీఆర్‌