ENGLISH

హరేరామ హరేకృష్ణ అంటున్న రెజినా

21 April 2017-19:29 PM

అందాల భామ రెజినా ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా 'హరే రామ హరే కృష్ణ'. టైటిల్‌ వెనుక పెద్ద కథే ఉందట. ఇది నాటక రంగం నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమాలో దిలీప్‌ ప్రకాష్‌ హీరోగా నటిస్తున్నాడు. ఒకప్పుడు సురభి సంస్థ నాటక రంగంలో సంచలనాలకు మారు పేరు. ఆ సురభి నాటక రంగ కళాకారుల చుట్టూ సాగే అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. నవీన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనూప్‌ రుబెన్స్‌ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుందని చిత్ర దర్శకుడు అర్జున్‌ సాయి చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడట దర్శకుడు అర్జున్‌ సాయి. రెజినా నటన ఈ సినిమాకే హైలైట్‌ అవుతుందని ఆయన చెప్పారు. ఇంకో వైపున ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్‌ సినిమాపై అందరి దృష్టీ పడేలా చేస్తున్నాయి. కుటుంబ కథా చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఇప్పటి ట్రెండ్‌లో ఈ సినిమా కుటుంబ ప్రేక్షకుల్ని సరికొత్తగా అలరిస్తుందని చిత్ర దర్శక నిర్మాతలు చెప్పారు. సినిమా ప్రారంభోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. సినిమా ఘనవిజయం సాధించాలని వారంతా ఆకాంక్షించారు. 

 

ALSO READ: బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన నందిత