ENGLISH

రేణూ దేశాయ్‌ మళ్లీ పెళ్లి చేసుకోబోతోందా?

16 June 2018-17:26 PM

సోషల్‌ మీడియాలో ఓ ఫోటో పోస్ట్‌ చేసింది హీరోయిన్‌ కమ్‌ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణూదేశాయ్‌. ఆ ఫోటోలో 'నా చేయి పట్టుకో విడిచిపెట్టకు. నాలో నమ్మకాన్ని కల్గించావ్‌ నువ్వు' అని ఆ ఫోటోపై రాసుంది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్‌ అయ్యింది. 

ఇదంతా చూస్తుంటే, రేణూదేశాయ్‌ మళ్లీ పెళ్లి చేసుకోబోతోందేమో అని నెటిజన్లు భావిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ నుండి రేణూదేశాయ్‌ విడిపోయి చాలా కాలమే అయ్యింది. కానీ రేణూ దేశాయ్‌కీ, పవన్‌ కళ్యాణ్‌కీ కలిగిన సంతానంతో మెగా కుటుంబానికి సంబంధ బాంధవ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. రేణూదేశాయ్‌తో విడాకులు తీసుకున్నాక పవన్‌ కళ్యాణ్‌ రష్యన్‌ భామ అన్నా లెజినోవాను మూడో వివాహం చేసుకున్నారు. 

కానీ రేణూదేశాయ్‌ మాత్రం ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. చాలా సందర్భాల్లో రేణూదేశాయ్‌ పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. ఆయన నుండి విడిపోయినా, పవన్‌ అంటే తనకు అభిమానమేననీ చాలాసార్లు పలు ఇంటర్య్వూలలో రేణూదేశాయ్‌ చెప్పింది. పవర్‌ స్టార్‌ అభిమానులు రేణూదేశాయ్‌ని వదినమ్మా అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు కూడా. 

అయితే తాజాగా ప్రచారంలో ఉన్న ఈ వార్తలో నిజమెంతుందో కానీ, రేణూదేశాయ్‌ ట్విట్టర్‌ నుండి రిలీజైన్‌ ఈ ఫోటో ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ALSO READ: నా నువ్వే మొదటి రోజు కలెక్షన్లు తెలిస్తే షాక్ అవుతారు