'కాంతార' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు రిషబ్ శెట్టి. కాంతారా మూవీకి దర్శకుడు కూడా రిషబ్. హీరోగా, దర్శకుడిగా కాంతారాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్. ప్రస్తుతం కాంతారా మూవీకి ప్రీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇలా తన వర్క్ తాను చేసుకుంటూనే మిగతా దర్శకులకి అందుబాటులో ఉంటున్నాడు. అన్ని భాషల్లోనూ అవకాశాలు అందుకుంటున్నాడు. తెలుగులో ప్రశాంత్ వర్మతో 'జై హనుమాన్' లో నటిస్తున్నాడు. ఇప్పడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. ఒక సౌత్ హీరో బాలివుడ్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ లో మెయిన్ లీడ్ లో నటించటం అంటే మామూలు విషయం కాదు.
రిషబ్ శెట్టి బాలీవుడ్ లో పవర్ ఫుల్ హిస్టారికల్ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఛత్రపతి శివాజీ బయోపిక్ తో రిషబ్ బాలీవుడ్ ఎంట్రీ అదిరింది. బుధవారం శివాజీ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. శివాజీ గెటప్ లో రిషబ్ పర్ఫెక్ట్ గా ఉన్నాడు. తన ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ తో శివాజీని తలపిస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో రిలీజ్ అయిన 'చావా' మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. శివాజీ కొడుకు శంభాజీ బయోపిక్ చావా. ఈ మూవీ ద్వారా శంభాజీ వీరత్వాన్ని తెలుసుకున్న సినీప్రియులు, ఇప్పడు శివాజీ వీరత్వాన్ని తెలుసుకుంటారు.
చావా పాజిటీవ్ వైబ్స్ ఛత్రపతి శివాజీపై హైపు పెంచుతోంది. చావా తరవాత శివాజీ బయోపిక్ పై అందరి ద్రుష్టి పడింది. ఈ క్రమంలోనే శివాజీ లుక్ తో ఉన్న రిషబ్ శెట్టి పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. సందీప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఛత్రపతి శివాజీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. జనవరి 21, 2027న ఈ మూవీ రిలీజ్ కానుంది.
RISHAB SHETTY IN & AS 'CHHATRAPATI SHIVAJI MAHARAJ':
— Wave Cinemas (@Wave_Cinemas) February 20, 2025
BRAND NEW POSTER UNVEILS... #ThePrideOfBharat: #ChhatrapatiShivajiMaharaj is releasing at #wavecinemas on 21 Jan 2027#SandeepSingh #RishabShetty #ThePrideOfBharat: #ChhatrapatiShivajiMaharaj. pic.twitter.com/Io2ZKZ2MHR
ALSO READ: పుష్ప రాజ్ గ్రేట్ అచీవ్ మెంట్