ENGLISH

'ఆర్‌ఆర్‌ఆర్‌': ఆ గుసగుస నిజమేనా?

30 January 2020-14:00 PM

గసగసాల గుసగుసలతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ తెగ ఘుమఘుమలాడిస్తోందిలే. తాజాగా అందుతోన్న గుసగుస ఏంటంటే, సన్నివేశాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. అందులో భాగంగా బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌ పాత్రను పెంచుతున్నాడనే గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. నిజానికి అలియాది చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రట. కానీ, ఆ పాత్రను ఇంకాస్త పెంచే దిశగా జక్కన్న మాయలు చేస్తున్నాడనీ తెలుస్తోంది. ప్యాన్‌ ఇండియా మూవీగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్యాన్‌ ఇండియా మూవీగా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఎక్కువ వసూళ్లు సాధించాలంటే, అక్కడ స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ ఉన్న అలియా పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉండాలి. అందుకే ఆమె పాత్ర నిడివి పెంచే దిశగా జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నాడట.

 

మరో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌కి జోడీగా ముద్దుగుమ్మ శ్రియ శరణ్‌ని ఎంచుకున్నాడనీ ఇటీవలే వార్తలొచ్చాయి. ఈ జంటపై తెరకెక్కించే సీన్స్‌ విషయంలోనూ జక్కన్న కేర్‌ఫుల్‌గా ఉంటున్నాడట. లేటెస్ట్‌ సమాచారం ప్రకారం ఓ భారీ బడ్జెట్‌ సాంగ్‌ని వీరిద్దరి మధ్యా షూట్‌ చేసే పనిలో జక్కన్న ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే యాక్షన్‌ హీరో అయిన అజయ్‌ దేవగణ్‌తో ఓ దిమ్మ తిరిగే యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా ఉండనుందట. ఎలాగూ రాజమౌళి తన సినిమాల్లో యాక్షన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు. అలాంటిది పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందే ఈ చిత్రంలో ఎందుకు తక్కువ చేస్తాడు. ఎక్కడా రాజీ పడడు. ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ ఈ కొత్త గాసిప్స్‌ చుట్టూనే తిరుగుతోందని సమాచారం.

ALSO READ: 'జాను' ట్రైలర్‌ టాక్‌: కూల్‌ అండ్‌ స్వీట్‌ లవ్‌ స్టోరీ!