ENGLISH

రాజ‌మౌళి 'గండిపేట' ర‌హ‌స్యం.

05 June 2020-12:00 PM

రాజ‌మౌళి సినిమా అంటే భారీ హంగులు ఉండాల్సిందే. ఆయ‌న క‌థ‌లు, క‌ల‌లు, ఆలోచ‌న‌లు అంతా హై రేంజులో ఉంటాయి. అందుకే రాజ‌మౌళి సినిమాల బ‌డ్జెట్లు అంత‌కంత‌కూ పెరుగుతూ ఉంటాయి. దాన్ని రాబ‌ట్టుకొనే కిటుకు కూడా జ‌క్క‌న్న‌కు బాగా తెలుసు. తాజాగా 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'కి రూ.300కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు పెడుతున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న చిత్ర‌మిది.

 

త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్ కి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. ఇందుకోసం హైద‌రాబాద్ శివార్ల‌లోని 'గండిపేట‌'లో ఓ భారీ సెట్‌ని వేస్తున్నారు. దీని విలువ సుమారు 18 కోట్ల‌ని టాక్. నెల రోజుల పాటు ఈ సెట్లోనే షూటింగ్ చేస్తారు. రామ్ చ‌ర‌ణ్‌పై కీల‌క‌మైన సన్నివేశాలు తెర‌కెక్కిస్తారు. కొన్ని యాక్ష‌న్ సీన్లూ ఇక్క‌డే రూపుదిద్దుకోబోతున్నాయి. గండి పేట‌లో సుమారు నాలుగు ఎక‌రాల విస్తీర్ణంలో వేస్తున్న సెట్ ఇది. లాక్ డౌన్ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉండేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి ఓ కీల‌క‌మైన అప్‌డేట్ వ‌స్తుంద‌ని స‌మాచారం. దాని కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ALSO READ: ఆ సినిమా రామ్ చ‌ర‌ణ్‌తోనేనా?