ENGLISH

సైరా! అనుకోనీయ్‌రా లైట్‌ తీస్కోరా!

06 October 2017-16:52 PM

చిరంజీవి 151వ సినిమా 'సైరా నరసింహారెడ్డి'పై పలు రకాల గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. రెహమాన్‌ లైట్‌ తీస్కున్నాడనీ, నయనతార వదిలేసిందనీ, అమితాబ్‌ డేట్స్‌ ఇవ్వలేదనీ, విజయ్‌ సేతుపతి నటించడం లేదనీ.. ఇలా పలురకాల గాసిప్స్‌ ఈ సినిమా చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది ఆషామాషీ సినిమా అయితే కాదు. మెగాస్టార్‌ చిరంజీవి సినిమా. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం. ఫర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తోనే ఈ సినిమాని స్టార్ట్‌ చేశారు. ఎవరి దగ్గర ఎన్నెన్ని డేట్స్‌ తీసుకోవాలో బేరీజు వేసుకున్నాకే సినిమాని అనౌన్స్‌ చేశారు. అంత తేలికైన విషయమేమీ కాదు ఇది. అయినా కానీ మెగా ఫ్యామిలీ సినిమాలకు ఇలాంటి గాసిప్స్‌ మామూలే. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ అయిన 'ఖైదీ నెం 150' చిత్రం విషయంలోనూ ఇలాంటి గాసిప్సే చక్కర్లు కొట్టాయి. అయినా కానీ సినిమా వచ్చింది. రికార్డులు కొల్లగొట్టింది. అదే ఈ సినిమా విషయంలోనూ జరగనుంది. అయినా కానీ ఈ మధ్య గాసిప్స్‌కి ఈ హీరో, ఆ హీరో అనే తేడా లేకుండా పోయింది. ఏ హీరో సినిమాకైనా గాసిప్స్‌ ఎక్కువైపోయాయి. సినిమా అన్నాక మార్పులు సహజమే. అయితే చాలా అరుదుగా మాత్రమే అనుకున్న వాటికి భిన్నంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి మార్పులు సహజమే. కానీ 'సైరా' విషయంలో అలాంటివేమీ జరగవనీ చిత్ర యూనిట్‌ పదే పదే చెబుతూనే ఉంది. ఈ సినిమా నిర్మాత అయిన రామ్‌ చరణ్‌ ప్రస్తుతం 'రంగస్థలమ్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక పూర్తిగా 'సైరా'పై ఫోకస్‌ పెట్టనున్నాడు చరణ్‌.

ALSO READ: 'భరత్‌ అనే నేను' స్టిల్ లీక్