ENGLISH

బిగ్ బాస్‌పై అవి రూమ‌ర్లేనా?

17 October 2020-17:30 PM

బిగ్ బాస్ 4 సీజ‌న్‌కి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు నాగార్జున‌. అయితే.. త‌న షూటింగ్ నిమిత్తం నాగ్ మ‌లేసియా వెళ్ల‌బోతున్నాడ‌ని, కొన్ని వారాల పాటు... బిగ్ బాస్ హోస్ లో నాగార్జున క‌నిపించ‌డ‌ని వార్త‌లొచ్చాయి. ఆ స్థానంలో ర‌మ్య‌కృష్ణ గానీ, రోజా గానీ.. హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెప్పుకున్నారు.

 

అయితే ఇవ‌న్నీ రూమ‌ర్లే అని తేలిపోయింది. నాగార్జున ఎక్క‌డికీ వెళ్ల‌డం లేద‌ట‌. ఈ సీజ‌న్ పూర్తిగా నాగ్ ఒక్క‌డే న‌డిపించేస్తాడ‌ని తెలుస్తోంది. ఈ వారానికి సంబంధించిన ఎపిసోడ్ల‌ని సైతం నాగార్జున పూర్తి చేసేశాడని టాక్‌. ఈ సీజ‌న్ అంతా నాగార్జున‌నే క‌నిపిస్తాడ‌ని, ఆయ‌న స్థానాన్ని మ‌రొక‌రితో భ‌ర్తీ చేయ‌బోవ‌డం లేద‌ని బిగ్ బాస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే.... నాగార్జున `వైల్డ్ డాగ్‌` షూటింగ్ ని బిగ్ బాస్ కోసం వాయిదా వేశాడా? లేదంటే... మ‌లేసియాలో కాకుండా హైద‌రాబాద్ లోనే షూటింగ్ పూర్తి చేస్తాడా? అనే విష‌యాల్లో మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి బిగ్ ‌బాస్ హౌస్ ని మాత్రం నాగ్ వీడ‌డం లేదు. ఓర‌కంగా బిగ్ బాస్ అభిమానుల‌కు ఇది శుభ‌వార్తే.

ALSO READ: ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి మ‌ళ్లీ నిరాశే